మ‌స్క్ చేతిలోకి ట్విట్ట‌ర్‌పై కొత్త ట్విస్ట్‌!

Update: 2022-05-07 14:46 GMT
మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా సైట్ ట్విట్ట‌ర్‌ను టెస్లా సీఈవో ఎల‌న్‌మ‌స్క్ టేకోవ‌ర్ చేసుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంది. ట్విట్ట‌ర్‌ను అధికారికంగా మ‌స్క్ త‌న ఆధీనంలోకి తీసుకున్నాక జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌పై ఇప్ప‌టికే హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుత మేనేజ్‌మెంట్‌పై న‌మ్మ‌కం విశ్వాసం లేద‌ని మ‌స్క్ చెబుతుండ‌టంతో ప్ర‌స్తుత సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్‌ను కొన‌సాగిస్తారా? అన్న విష‌య‌మై అనిశ్చితి కొన‌సాగుతోంది. అయితే, మ‌స్క్ చేతిలో ట్విట్ట‌ర్ భ‌విష్య‌త్తు ఏంట‌నే సందేహం ఓ వైపు అమెరికా దిగ్గ‌జం బిల్ గేట్స్ వ్య‌క్తం చేస్తుండ‌గా... .అస‌లు ఈ కొనుగోలు నిర్ణ‌యంపైనే కోర్టులో కేసు దాఖ‌లైంది.

44బిలియ‌న్ డాల‌ర్ల‌కు మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్‌ను టెస్లా సీఈవో ఎల‌న్‌మ‌స్క్ సొంతం చేసుకునేందుకు స‌ర్వం సిద్ధ‌మైంది. అయితే, మ‌స్క్ సామ‌ర్థ్యంల‌పై లియ‌నీర్ బిల్‌గేట్స్ అనుమానాలు వ్య‌క్తం చేశారు.

ఎల‌న్‌మ‌స్క్ తీసుకుంటే మైక్రోబ్లాగింగ్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప‌రిస్థితి దారుణంగా మారుతుంద‌ని బిల్‌గేట్స్ హెచ్చ‌రించారు. ట్విట్ట‌ర్ కోసం గొప్ప ఇంజినీర్ల‌ను నియ‌మించ‌గ‌ల‌రు. మ‌స్క్ వ‌ద్ద మ‌నీ ఉంది కానీ టెస్లా, స్పేస్ ఎక్స్ మాదిరిగా ట్విట్ట‌ర్‌లోనూ స‌క్సెస్ సాధించ‌గ‌ల‌మ‌ని అంచ‌నా వేయొద్ద‌ని ఎల‌న్‌మ‌స్క్‌కు బిల్‌గేట్స్ సూచించారు.

మ‌స్క్‌ గురించి సానుకూల అంశాలే చెబుతాన‌ని బిల్‌గేట్స్ అన్నాడు. ఆయ‌న ఒక‌వేళ ట్విట్ట‌ర్ ప‌రిస్థితి దారుణంగా మారిస్తే ఫైన్‌.. బాగుంటుంది. నేను అప్పుడే మాట్లాడ‌తా.. కానీ ఏదో జ‌రుగుతుంద‌ని నేను ఊహించి మాట్లాడ‌ను అని వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్‌తో చెప్పారు.

కాగా, వాక్ స్వాతంత్య్రానికి స్వ‌ర్గ‌ధామంగా ట్విట్ట‌ర్‌ను రూపుదిద్దుతానంటున్న ఎల‌న్‌మ‌స్క్‌.. సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్‌లో ద్వేష పూరిత ప్ర‌సంగాలు, త‌ప్పుడు స‌మాచారం ప్రచారం కాకుండా ఎలా చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది మస్క్ వెల్ల‌డించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బిల్ గేట్స్ త‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాగా, మ‌స్క ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేయ‌డంపై ట్విట్ట‌ర్ వాటాదారుల్లో ఒక‌రైన 'ఫ్లోరిడా పెన్ష‌న్ ఫండ్' కేసు వేసింది. త‌మ సంస్థ‌తో పాటుగా, ఇత‌ర సంస్థ‌ల‌కు సంబంధించిన ట్విట్ట‌ర్ వాటాదారుల్లో కూడా మూడింట ఒక‌వంతు ఆమోదం దొరికిన త‌ర్వాతే ట్విట్ట‌ర్ కొనుగోలుకు అనుమ‌తి ఇవ్వాల‌ని డెలావెర్ చాన్సెల‌రీ కోర్టులో కేసు వేసింది. కాగా, ఫ్లోరిడా పెన్ష‌న్ ఫండ్ మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక స‌ల‌హాదారుగా ఉంది. మ‌రోవైపు ట్విట్ట‌ర్‌లో మోర్గాన్ స్టాన్లీకి 8.8% వాటా ఉంది.
Tags:    

Similar News