వైసీపీ మాజీ మ‌హిళా మంత్రికి ఇన్ని క‌ష్టాలా...!

Update: 2022-07-17 00:30 GMT
రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. వ్యూహాల‌ను బ‌ట్టి మారిపోతూ ఉంటాయి. అవ కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని.. అందిపుచ్చుకున్న నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కుతారు. లేక పోతే.. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అది ఏ పార్టీ అయినా.. ఏ నేత అయినా.. కామ‌న్‌ గా జ‌రుగుతున్న కార్య క్రమ‌మే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే గుంటూరు కు చెందిన కీల‌క నాయ‌కురాలు.. మాజీ మంత్రి సుచ‌రిత ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు.

గ‌త జ‌గ‌న్ కేబినెట్‌లో హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన సుచ‌రిత ప‌రిస్థితి ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డింద‌నే టాక్‌ వినిపిస్తోంది. మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న కేడ‌ర్‌ను ప‌ట్టించుకోలేదు. కేవ‌లం గుంటూరుకు ప‌రిమిత‌మ‌య్యారు.

అదేస‌మ‌యంలో మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా.. ఆమె ఎక్కువ‌గా ప్ర‌జల్లో కి రాలేదు. దీంతో సుచ‌రిత మంత్రిగా చేసిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన ముద్ర ను మాత్రం వేసుకోలేక పోయారు.

ఇదే ఇప్పుడు ఆమెకు మైన‌స్‌గా మారిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం సుచ‌రిత‌కు మంత్రి ప‌ద‌వి లేదు. దీంతో ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. పైగా.. నియోజ‌క‌వర్గం లో ఇప్పుడు కూడా ఆమె ఉండ‌డం లేదు.

వివిధ కారాణాల‌తో ఆమె ప్ర‌యాణం చేస్తు న్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాలతో సొంత నియోజ‌క‌వ‌ర్గం.. ప్ర‌త్తిపాడులో సుచ‌రిత‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.

గ‌తంలో 2009లో ఒక‌సారి గెలిచినప్పుడు కూడా ఇలానే చేశార‌ని.. దీంతో త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మి పాల‌య్యార‌ని ఒక టాక్ ఉంది. అయిన‌ప్ప‌టికీ.. గ‌తం నుంచి ఏమీ నేర్చుకోక‌పోగా.. ఇప్పుడు కూడా మారుతున్న ప‌రిణామాల‌కు అనుకూలంగా ఆమె త‌న‌ను తాను మార్చుకోలేక పోవ‌డం.. పెద్ద మైన‌స్‌గా మారిపో యింద‌ని చెబుతున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె గెలుపు గుర్రం ఎక్క‌డం అంత ఈజీకాద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News