మేకతోటి సుచరిత. వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి. ఒక్కసారిగా రాజకీయంగా దుమారం రేపారు. ఎంత వేగంగా అయితే.. దుమారం రేపారో.. అంతే వేగంగా చప్పబడిపోయారు. ఈ పరిణామాలను గమనించిన తర్వాత.. ఆమె రాజకీయం `టీ కప్పులో తుఫాను` అని వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. అదే సమయంలో ఈ రాజకీయంతో ఆమె ఏదో `సాధించార`నే టాక్ సైతం పార్టీలో వినిపించింది. దీంతో అసలు ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది.
గత ఏడాది ఏప్రిల్ వరకు బాగానే ఉన్న సుచరిత.. మంత్రి వర్గం నుంచి తనను తప్పించినందుకు బాధప డ్డారని పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ ఇక్కడ అసలు రీజన్.. తనను తప్పించడం కాదు.. తనను తప్పించి వేరేవారిని కొనసాగించడమే! ఇదే అసలు సమస్య.అప్పటి మంత్రి బాలినేని ఆవేదన కూడా ఇదే కదా.. తనను తప్పించినందుకు ఆయన బాధపడలేదు.. ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించినందుకు బాధపడ్డారు.
ఇలా.. సుచరిత అప్పట్లో ఆవేదన చెందారని ఆమె వర్గం పేర్కొంది. సరే.. తరచుగా ఆ ఆవేదనను బాధను కూడా.. ఆమె వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక.. రెండు రోజులుగా.. `నా భర్తతోనే నా రాజకీయం` అంటూ దుమ్ము రేపారు. వాస్తవానికి సుచరిత భర్త దయాసాగర్ ఐఆర్ ఎస్ అధికారి కావడంతో ఆయన ఇప్పటికిప్పు డు రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. అయితే.. ఆయన స్వయంగా రిజైన్ చేసి వలంటీర్‌గా విరమణ పొం దారు. బహుశ దీనిని దృష్టిలో పెట్టుకుని సుచరిత ఇలా వ్యాఖ్యానించి ఉంటారు.
మొత్తానికి ఈ రాజకీయ తుఫానుకు.. దయాసాగరే స్వయంగా తన లేఖతో ఫుల్ స్టాప్ పెట్టారు. తాము వైసీపీ లోనే ఉంటామని.. జగన్‌తో నే కలిసి నడుస్తామని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరి సుచరిత ఇంత యాగీ చేసి సాధించిందేమీ లేదా? ఊరికేనే టైం పాస్ కోసం ఇదంతా చేశారా? అంటే కాదు. అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందని.. ఆమెకు ఇవ్వాల్సిన ఎష్యూరెన్స్ ఇచ్చారని.. తెలుస్తోంది. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. కీలక సలహాదారు సుచరితకుఫోన్ చేసి మాట్లాడి.. హామీ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి టీ కప్పులో తుఫానే అయినప్పటికీ.. సుచరిత అనుకున్నది దక్కించుకున్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.