అవును ఏపీ జనాలను ఆ ఇద్దరు అగ్ర నాయకులూ నిరాశపరచారు. వారే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు. విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కి ఇద్దరు నేతలూ హాజరయ్యారు. అయితే ఎదురుపడలేదు, పలకరించుకోలేదు.
ఒకరి తరువాత ఒకరు వచ్చారు. ఎవరికి వారుగా తమ తమ టేబిల్స్ వద్ద కూర్చున్నారు. దాంతో ఎట్ హోం లో రాజకీయ మ్యాజిక్ జరుగుతుందని ఆశించిన వారికి పూర్తి నిరాశ ఎదురైంది.
నిజానికి పవన్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. కానీ ఆయన రాలేదు. ఇక ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా ఈ కర్యక్రమానికి హాజరయ్యారు. ఆయన గవర్నర్ దంపతుల పక్కన ప్రధాన టేబిల్ వద్ద కూర్చుకున్నారు. అదే టేబిల్ వద్ద హై కోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా ఉన్నారు.
ఇక దానికి కాస్తా ఎడమ పక్కన ఉన్న టేబిల్ వద్ద చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని కూర్చున్నారు.
బాబు జగన్ ఒకరికి ఒకరు ఎదురుపడతారని, వారిద్దరూ కనీసం పలకరించుకుంటారని అంతా ఏవేవో ఊహించుకున్నారు కానీ చివరికి ఇద్దరు నేతలు ఇలా తేల్చేశారు. పవన్ మెరుపులు అయినా ఉంటాయనుకుంటే ఆయన ఎటూ హాజరే కాలేదు. మొత్తానికి ఎట్ హోం కార్యక్రమం అలా జరిగిపోయింది.