తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలు.. గుసగుస వినిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నాయకులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపు గుర్రం ఎక్కేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఅయితే.. అధికార, ప్రతిప క్ష పార్టీల మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. ఇదిలావుంటే.. తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన పని.. ఫక్తు..ఎన్నిక లప్రచారాన్ని తలపిస్తోందని అంటున్నారు.
పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో త్వరలోనే బాజా భజంత్రీలు మోగనున్నాయి. ఆయన కుమారుడు.. డాక్టర్ నయన్ రాజ్ వివాహం ఈ నెల 20న జరగనుంది. సాధారణంగా.. కుమారుడి వివాహం అంటే.. అట్టహాసంగా చేయడం రివాజే.
సామాన్యుల నుంచి పెద్దల వరకు.. అందరూ ఘనంగానే పెళ్లి చేయాలని భావిస్తారు. అయితే.. పువ్వాడ మాత్రం కొత్త పంథాను ఎంచుకున్నారు. తన కుమారుడి పెళ్లిని కూడా ఆయన ఎన్నికల ప్రచారంగా మార్చారనే గుసగుస వినిపిస్తోంది.
డాక్టర్ నయన్ రాజ్ వివాహం సందర్భముగా మంత్రి పువ్వాడ.. పెళ్లి కానుకగా ప్రతేకంగా గోడ గడియారాలను తయారు చేయించారు. ఈ గడియారాల్లో ఎక్కడా.. పెళ్లి కుమారుడి ఫొటోలేదు. ఒకవైపు.. కేసీఆర్.. మరోవైపు.. కేటీఆర్.. ఇంకో వైపు.. పువ్వాడ అజయ్ ఫొటోలను ముద్రించారు. వీటిని నియోజకవర్గం వ్యాప్తంగా .. పంపిణీ చేస్తున్నారు.
అన్ని డివిజన్లలోని కార్పొరేటర్లకు.. ఈ కానుకలను ప్రజలకు పంపిణీ చేసే బాధ్యతలను అప్పగించారు. శుభలేఖతోపాటు.. ఈ గడియారాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తున్న ప్రత్యర్థి పార్టీల నేతలు.. అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారే.. అని ముక్కున వేలేసుకుంటున్నారు.