ఏపీ మంత్రికి సెగ పెరుగుతోంది.. సీటు జారుతుందా?

Update: 2022-09-07 11:30 GMT
ఏపీ మంత్రి, యువ నాయ‌కుడు.. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌.. ఆవెంట‌నే మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిఅంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసిన నేత‌.. సీదిరి అప్ప‌ల‌రాజు. ఆదిలోఆయ‌న‌పై అనేక అంచ‌నాలు ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఒక్కొక్క‌టిగా క‌రిగిపోతున్నాయి.  ఎంతోమంది సీనియ‌ర్ల‌ను.. పార్టీ జెండాను భుజాన వేసుకుని ఆది నుంచి ప‌నిచేసిన వారినికూడాప‌క్క‌న పెట్టి.. సీఎం జ‌గ‌న్‌.. సీదిరికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.   అయితే..సీదిరి ఈ గౌర‌వాన్ని, ప‌ద‌విని కూడా కాపాడుకునేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదనే వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే.. ఆయ‌న రాష్ట్రంలో పెద్ద‌గా ప‌ర్య‌టించిన సంద‌ర్భాలు లేదు. త‌న శాఖ‌పై కూడా ఆయ‌న‌కు ప‌ట్టులేకుండా పోయింది.  ఏం జ‌రుగుతోంద‌నే విష‌యాల‌పై దృష్టి కూడా పెట్ట‌డం లేదు. కేవ‌లం నియోజ‌క వ‌ర్గానికి మాత్ర‌మే సీదిరి ప‌రిమితం అవుతున్నార‌ని సొంత పార్టీ నాయ‌కులే అంటున్నా రు. నియోజ‌క‌వ‌ర్గం పై ఉన్న దృష్టి.. రాష్ట్రంపై పెట్ట‌డం లేద‌ని.. ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా విమ‌ర్శిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో సీదిరి గ్రాఫ్ పెర‌గ‌క‌పోగా.. ఆయ‌న `నియోజ‌క‌వ‌ర్గం మంత్రి` అనేవ్యంగ్యాస్త్రాలు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు.. పోలీసుల‌పై  దూకుడు.. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లు... సోద‌రుడితో క‌లిసి.. స‌ముద్రంలో చేప‌ల  వేట వంటివాటికే ఆయ‌న‌ప‌రిమితం అవుతున్నార‌ని.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. సొంత పార్టీలో త‌న‌కు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అండ‌గా ఉన్న నాయ‌కుల‌ను ఇప్పుడు సీదిరి విస్మ‌రిస్తు న్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో పలాసలో మంత్రి అప్పలరాజుకు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. వజ్రపుకొత్తూరు మండలం సారదాపురంలో మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు  సమావేశమయ్యారు.

మంత్రి అప్పలరాజు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ  జిల్లా కార్యదర్శి దువ్వాడ హేంబాబు నేతృత్వంలో సమావేశం జరిగింది. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు సమావేశానికి హాజరయ్యారు. మంత్రి అప్పలరాజు బెదిరింపు రాజకీయాలకు పాలపడుతున్నారని నేతలు ఆరోపిస్తున్నారు.

మంత్రి తీరుపై సీఎంకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సీదిరికి బాగానే సెగ పెరుగుతోంద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌క‌పోయినా.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News