ర‌చ్చ గెలిచిన మోడీ.. ర‌ష్యా యుద్దం ఆపాల్సిందే!

Update: 2022-11-16 16:39 GMT
భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇంట ఎలా ఉన్న‌ప్ప‌టికీ ర‌చ్చ గెలిచారు. ప్ర‌పంచ దేశాలు ఆయ‌న మాట‌కు క‌ట్టుబ‌డ్డాయి. ర‌ష్యా-ఉక్రెయిన్‌ల మ‌ధ్య యుద్ధాన్ని ఆపాల‌న్న మోడీ వ్యాఖ్య‌ల‌కు అన్ని దేశాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఇండోనేషియా రాజ‌ధాని బాలిలో జ‌రుగుతున్న జీ-20 దేశాల శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో మోడీ అన్ని దేశాల మ‌న‌సుల‌ను దోచుకున్నారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలు జీ20 శిఖరాగ్ర సదస్సులో తాజాగా మ‌రోసారి ప్రతిధ్వనించాయి. ప్రస్తుత సమయం యుద్ధానికి కాదంటూ సభ్య దేశాలన్నీ ముక్తకంఠంతో వ్యాఖ్యానించాయి. ఈ మేరకు ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో చాలా అంశాలు రష్యా ఆక్రమణ చుట్టూనే తిరిగాయి. సభ్య దేశాలన్నీ యుద్ధం, దాని ప్రభావంపై చర్చించాయి.

అనంతరం, శాంతిస్థాపన కోరుతూ ఉమ్మడి ప్రకటన చేశాయి. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే ఆహార, ఇంధన భద్రతపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. సెప్టెంబర్ 16న ఉజ్బెకిస్థాన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయిన మోడీ.. 'ఇది యుద్ధాల కాలం కాదు' అని ఆయనకు నేరుగా హితవు పలికారు. ఘర్షణను వెంటనే ముగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీ20 సదస్సు ఉమ్మడి ప్రకటన సైతం ఇవే వ్యాఖ్యలను ఉపయోగించి.. శాంతికి పిలుపునిచ్చింది.

అదే సమయంలో అక్రమ, అసంబద్ధ, రెచ్చగొట్టే విధానాలను వీడాలని రష్యాకు సూచించింది. ఉమ్మడి ప్రకటన విషయంలో అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చేందుకు భారత్ విశేషంగా కృషి చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలతో చర్చలు జరిపి.. తుది ప్రకటన తయారు చేయడంలో సహకరించిందని పేర్కొన్నాయి. భారత్.. ఓ లీడర్గా, పరిష్కార మార్గాలను సూచించిందని, నిర్మాణాత్మక విధానాన్ని అవలంబించిందని తెలిపాయి. దీంతో ఇప్పుడు ప్ర‌పంచ ప‌టంలో మోడీ ఐకాన్‌గా నిలిచారు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News