మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు.. రావెల కిశోర్ బాబు రాజకీయాలు ముగిసిపోయాయా? ఆయనను ఏ పార్టీ కూడా పిలవడం లేదా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా టికెట్ దక్కించుకుని టీడీపీ తరఫున 2014లో విజయం సాధించిన రావెలకు అంతే దూకుడుగా.. మంత్రి పదవి దక్కింది.
ఇది బహుశ రావెల తన జీవితంలోనే ఊహించి ఉండరు. ఎందుకంటే.. అప్పటికే ఎంతో మంది సీనియర్లు ఉండి కూడా చంద్రబాబు రావెలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. అలాంటి బాబును కాదని.. రావెల వేసిన.. ఫీట్లు చివరకు ఆయనకే రాజకీయ సమస్యలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు టికెట్ ఇవ్వడం గెలిచి చూపిస్తాను.. అన్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.
ఎస్సీ వర్గాన్ని పార్టీకి చేరువ చేస్తారని ఆశించారు. అయితే.. ఆయన వివాదాల సుడిలో చిక్కుకుని.. అతి స్వల్ప కాలంలోనే పదవిని పోగొట్టుకున్నారు. దీంతో 2019 ఎన్నికలకు ముందు పార్టీకి దూరమయ్యారు. ఈ సమయంలోనే ఆయన జనసేన పార్టీలో చేరారు. తర్వాత.. బీజేపీలోకి జంప్ చేశారు. అయితే.. ఆయన తన సొంత సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావ డంలోనూ.. పార్టీలను పక్కన పెట్టి.. తనవ రకైనా.. వారు మద్దతు ఇచ్చేలా చక్రం తిప్పడంలోనూ విఫలమయ్యారనేది వాస్తవం. గతంలో మంద కృష్ణ మాదిగ వంటివారితో పరిచయం పెట్టుకున్నప్పటికీ.. ఆయనకు ఆశించిన మైలేజీ దక్కలేదు.
దీంతో బీజేపీ నుంచి, జనసేన నుంచి కూడా ఆయన బయటకు వచ్చారు. అయితే.. ఇదంతా కూడా టీడీపీలో చేరేందుకు రావెల చేస్తున్న ప్రయత్నమని కొందరు చెప్పుకొచ్చారు. కానీ, స్థానికంగా.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులకు రావెలకు మధ్య సఖ్యత లేకుండా పోవడం.. ఆయనకు టికెట్ ఇవ్వద్దని.. అసలు పార్టీలోకే చేర్చుకోవద్దని.. కొందరు సీనియర్లు.. చంద్రబాబుకు చెప్పడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది. అంతేకాదు.. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిపిస్తామంటూ.. మాకినేని పెదరత్తయ్య వంటి వారు చంద్రబాబుకు చెబుతున్నారు.
దీంతో రావెలకు టీడీపీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు.. చంద్రబాబు కూడా రావెల విషయాన్ని ప్రత్యేకం గా ఏమీ చూడడం లేదు. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదన్న భావనతోనే ఉన్నారు. ఇక, వైసీపీలోకి వచ్చే అవకా శం కూడా లేదు. ఇక్కడ మేకతోటి సుచరిత ఉండడంతో ఆమెనుకాదని .. జగన్ వేరే వారికి అవకాశం ఇచ్చేది కూడా లేదు. జనసేన లోనూ రావెల విషయంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ పరిణామాలను గమనిస్తే.. రావెలకు రాజకీయంగా తెరపడినట్టేన ని అంటున్నారు గుంటూరు రాజకీయ నాయకులు. ఏదైనా అద్భుతాలు చేస్తే తప్ప.. రావెల వచ్చే ఎన్నికల్లో పరిస్థితి మెరుగు పరుచుకునే పరిస్థితి లేదని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.