ఏపీలో రాజకీయం చిత్ర విచిత్రంగా సాగుతోంది. విపక్షాల్లో ఉన్న ఏ పార్టీ కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపించడంలేదు. పొత్తులు ఉంటాయా ఉంటే ఎలా ఉంటాయి. ఎవరికి మేలుగా అవి ఉంటాయి అన్న టెన్షన్ అధినాయకత్వాల స్థాయిలో ఒక వైపు ఉంటే ఇక నాయకుల స్థాయిలో తమకు సీటు ఉంటుందా లేదా అన్నది పెద్ద టెన్షన్ గా మారుతోంది.
ఈ నేపధ్యంలో తన గత వైఖరికి భిన్నంగా చంద్రబాబు మొత్తం సిట్టింగులు అందరికీ టికెట్లు ఇచ్చామని చెప్పేశారు. సరే బాబు గారు తాంబూలాలు ఇచ్చేశారు అనుకుంటే పొత్తుల కధ అడ్డం పడుతుందా అన్నదే ఇపుడు చాలా మంది సిట్టింగుల బాధగా ఉందిట. ప్రస్తుతం టీడీపీకి కలిపి 19 మంది ఉన్నట్లుగా లెక్క. బాబుని పక్కన పెట్టినా ఈ పద్దెనిమిది మంది సీట్లలో కూడా కొన్నిటి మీద బీజెపీ జనసేనల కన్ను ఉంది అంటున్నారు.
పైగా అక్కడ చాలా కాలంగా ఆ పార్టీ నాయకులు గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకుంటూ పోతున్నారు అంటున్నారు. మరి అలాంటి సీట్లను బాబు మీరే రేపటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని తమ్ముళ్లకు ఇచ్చేశారు. కానీ రేపటి రోజున పొత్తులలో కచ్చితంగా ఈ సీట్లను జనసేన కానీ బీజేపీ కానీ పట్టుబడితే అపుడు బాబు గారు ఏమంటారు, దానికంటే ముందు ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేసి తామే క్యాండిడేట్ అనుకుని ఖర్చు చేసుకుని పోయే తమ్మళ్ళకు పొత్తుల షాక్ తగిలితే ఎవరు జవాబు చెబుతారు అన్నదే చర్చగా ఉందిట.
ఇదిలా ఉంటే విశాఖలో చూస్తే నార్త్ సీటు ఇపుడు గంటా శ్రీఎనివాసరావు ఉన్నారు. ఈ సీటు టీడీపీది, మళ్లీ టీడీపీకే ఈ సీటు అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కానీ ఇక్కడ బీజేపీ పాగా వేయడానికి సిద్ధంగా ఉంది. పొత్తు ఉంటే బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు రంగంలోకి వస్తారు. మరి ఆయన్ని కాదనగలరా అన్నదే చూడాలి. అలాగే రాజమండి సిటీలో ఆదిరెడ్డి భవానీకే టికెట్ అనేశారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే, వచ్చే ఎన్నికల్లో ఆమె భర్త వాసు పోటీ చేయవచ్చు. కానీ ఈ సీటు మీద బీజేపీ కన్ను ఉంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ తరఫున ఆకుల సత్యనారాయణ గెలిచారు. దాంతో బీజేపీ వదులుకోదు అని అంటున్నారు.
అలాగే రాజమండ్రీ రూరల్ సీటు మీద జనసేన కర్చీఫ్ వేసేసిందని టాక్. ఇక్కడ కందుల దుర్గేష్ ఆ పార్టీకి గట్టి నేతగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన సింగిల్ గా పోటీ చేసి మంచి ఓట్లు రాబట్టారు. అయితే ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు కన్ ఫర్మ్ చేసేశారు చంద్రబాబు. మరి ఆయన సీటు కోసం కచ్చితంగా పవన్ జోక్యం చేసుకుంటారు అని అంటున్నారు. అపుడు గోరంట్ల సిట్టింగ్ సీటు ఏమవుతుంది అన్నదే చర్చగా ఉంది.
అలాగే పెద్దాపురం సీటు విషయంలో కూడా జనసేన తనకు కావాలని పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు టికెట్ మళ్ళీ అని చంద్రబాబు ప్రకటించేశారు. కానీ జనసేన ఊరుకోదనే అంటున్నారు. ప్రజరాజ్యం తరఫున అప్పట్లో అంటే 2009 ఎన్నికల్లో గెలిచిన సీట్లలో పెద్దాపురం ఉంది. ఇపుడు కూడా అక్కడ జనసేనకు పట్టు ఉందిట. దాంతో ఈ సీటు మీద జనసేన టార్గెట్ చేసే రాజప్పకు కష్టమే అని చెబుతున్నారు.
ఇలాంటి సీట్లు కనీసం అరడజన్ పైగా ఉన్నాయట. మరి బాబు సిట్టింగులకు సీట్లు ఇచ్చేశాం, ఎంచక్కా పనిచేసుకోండి అని చెప్పినా వారు అయితే ఈ టెన్షన్ తో ఉన్నారని అంటున్నారు. పొత్తుల పేరిట బీజేపీ జనసేన తమకు షాక్ ఇస్తాయా లేక వరాలే ఇస్తాయా అన్నది మాత్రం టీడీపీ సిట్టింగులకు ఇప్పుడు అర్ధం కావడంలేదు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.