వైసీపీ విజయం కోసం డబ్బులు గట్టిగా ఖర్చు చేశామని, తీరా అధికారంలోకి వస్తే మమ్మల్ని అసలు పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు మండుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కెకె అగ్రహారం పంచాయతీ పరిధిలోని సంజీవపురం గ్రామంలో గడప గడపకు మన సర్కార్ కార్యక్రమంలో వైసీపీ ఉప సర్పంచ్ రాజు ఆయన సోదరుడు చిన్ని రాజు అయితే ఎమ్మెల్యేనే నిలదీశారు.
మన ప్రభుత్వం అనుకోవడానికి ఎక్కడ వీలుందని కూడా ప్రశ్నించారు ఉపాధి హామీ పధకం కింద తాము ప్రతీ రోజూ చెట్లకు నీళ్ళు పెడుతున్నామని కానీ డబ్బులు ఇవ్వడానికి ఫీల్డ్ అసిస్టెంట్ నందీశ్వర్ లంచం అడుగుతున్నారని వాపోయారు. ఇది తమ ప్రభుత్వం అయితే మమ్మల్నే ఇలా ఇబ్బంది పెడుతుందా అని వారు నిగ్గదీశారు.
ఇక ఎమ్మెల్యేకు ఈ తరహా ఫిర్యాదులు చేసిన వారిలో ఉపాధి హామీ కూలీలు కూడా ఉన్నారు. తమకు రావాల్సిన రోజు వారీ కూలి డబ్బులలో కూడా మూడు వందలు కడితే తప్ప ఇవ్వమని ఫీల్డ్ అసిస్టెంట్ నందీశ్వర్ చెప్పడాన్ని ఎలా చూడాలని అడిగారు. ఇక ఉప సర్పంచ్ ఫ్యామిలీ అయితే తాము వేల రూపాయలు ఖర్చు చేసి పనులు చేశామని, తమ బిల్లులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు.
అలాగే గ్రామ సచివాలయాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, వాటి వల్ల ఒక్క పని కూడా అవడంలేదని ఆరోపించారు. అంతే కాదు తమ ప్రాతానికి వచ్చిన ఎమ్మెల్యేకు రోడ్లు, కాలువలు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పాఠశాలల విలీనం వంటి వాటిపైన గ్రామస్తులు ఎడా పెడా ఫిర్యాదులు చేశారు. దాంతో ఏమి చెప్పాలో అర్ధం కాక ఎమ్మెల్యే తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఇక్కడ ఒక మాటను అయితే జనాలు అంటూ విమర్శలు చేస్తున్నారు. మన ప్రభుత్వంలో దళారీలు ఉండరు, ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా డబ్బులు మీ ఖాతాలలోకే అని చెబుతున్న జగన్ కి ఈ అధికారుల లంచాలు, దళారీతనం మీద ఫిర్యాదులు రావడంలేదా లేక ప్రభుత్వం పట్టించుకోవడం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.