లేడీ టెకీకి లైనేశాడు.. మాయ మాటలు చెప్పి దోచేయాలనుకున్నాడు.. కానీ.. ఫుల్ రివర్స్
ప్రేమ! ఈ రెండు అక్షరాలు.. అవధులు దాటి.. మరీ.. యువతీయువకులను కలుపుతున్నాయి. కొందరు దీంతో బంధాలు ఏర్పరుచుకుని.. జీవితాలను పండించుకుంటుండగా.. మరికొందరు ఈ అనిర్వచనీయమైన ప్రేమను అడ్డు పెట్టుకుని.. సంపాయించాలని.. అడ్డగోలుగా మోసం చేయాలని.. చూస్తున్నారు. ఇలాంటి ప్రేమలో చిక్కుకుని అనేక మంది ఇప్పటికే మోస పోయారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు మనకు ఎదురైన ఘటనలో ప్రేమ పేరిట వంచించాలని ప్రయత్నించిన యువకుడికి.. లేడీ టెకీ.. సరైన సమాధానం చెప్పింది.. కటకటాలు లెక్కించేలా చేసింది.
ఎక్కడ? ఏం జరిగింది?
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలో 24 ఏళ్ల యువతి నివాసం ఉంటోంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమె ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తోంది. లేడీ టెకీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో సహ పలు యాప్స్ లో లేడీ ఇంజనీరుకు అకౌంట్ లు ఉన్నాయి.
ఈ క్రమంలో యతీశ్వరన్ అనే యువకుడు ఈ టెకీకి పరిచయం అయ్యాడు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నానని గత ఏడాది లేడీ టెకీని పరిచయం చేసుకున్నాడు. తరువాత యతీశ్వరన్, ఆమె సోషల్ మీడియాలో `ఒక్కటై` పోయారు. లవ్ చేసుకున్నారు. ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజు గంటలు గంటలు మాట్లాడుకున్నారు. ఇంకేముంది.. ఆమె అతనిని బాగా నమ్మింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆమె మంచిదే. కానీ, అతడు మాత్రం.. మోసం చేయాలని భావించాడు. యువతికి మాయమా టలు చెప్పిన యతీశ్వరన్ ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు షేర్ చెయ్యాలని ఒత్తిడి చేశాడు. ఏదో ప్రేమతో అడుగుతున్నాడు కదా.. అనుకున్న ఆమె.. అంతే ప్రేమగా నగ్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది. అయితే.. వాటిని అతను చూసి డిలీట్ చేయకుండా.. దాచేశాడు. ఇక్కడే అతని పన్నాగం మనకు అర్ధమవుతుంది.
ఇక, ఆ తర్వాత.. ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నానని యతీశ్వరన్ ఆమె చెప్పాడు.. అంతేకాదు.. ప్రస్తుతం తన దగ్గర రూపాయి కూడా లేదని.. ఆసుపత్రి బిల్లు కట్టాలని కోరుతూ.. అతని అకౌంట్ లో ఆమె నుంచి రూ. 70 వేలు వేయించుకున్నాడు. పాపం.. ఇది నిజమేనేమో.. ప్రేమికుడు కష్టంలో ఉన్నాడని.. ఆమె ఆ సొమ్ము వేసేసింది.
తర్వాత.. ఒక ఫైన్ డే.. యతీశ్వరన్ ను ఆమె నేరుగా కలుసుకుంది. ఆ సందర్బంలో కేటుగాడు యతీశ్వరన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చెయ్యలేదని, గాలికి తిరుగుతున్నాడని అసలు స్టోరీ తెలుసుకుంది. అప్పటికి కూడా.. ఆమె అతనిని ఏమీ అనలేదు. కేవలం దూరం పెట్టింది. అంతే! అయితే.. ఆది నుంచి మోసపూరితంగా వ్యవహరించిన అతడు మాత్రం ఆమె మీద పగ పెంచుకున్నాడు.
రూ. 3 లక్షలు ఇవ్వాలని.. మరోసారి ఫోన్ చేసి యువతిపై ఒత్తిడి తెచ్చాడు. అంతేకాదు.. ఇవ్వలేదంటే నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే.. ఆమె కుమిలి పోలేదు.. ప్రాణాలు సైతం తీసుకోలేదు.. నేరుగా వెళ్లి కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు యతీశ్వరన్ ను అరెస్టు చేశారు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నానని పలువురిని మోసం చేసిన యతీశ్వరన్ పరమశివం అని, అతనిది విరూద్ నగర్ జిల్లా అని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు. యతీశ్వరన్ అలియాస్ పరమశివం మీద నాలుగు సెక్షల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. సో.. నేటి యువతులకు.. ఈమె ఆదర్శం అనడంలో సందేహం లేదు. మోసపోయామని.. ప్రాణాలు తీసుకోవడం కాదు.. మోసం చేసిన వాడి అంతు చూసిన వైనం.. ఈ స్టోరీలో మనకు కళ్లకు కట్టిన యువతికి హ్యాట్సాఫ్!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.