ఏపీలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రూ 15,000 కోట్ల అంచనాతో 18 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను చేపట్టినట్లుకేంద్ర రవాణా - రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభ వేదికగా తెలిపారు. వైసీపీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు - మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. జాతీయ రహదారుల విస్తరణ - అభివృద్దితోపాటు మరో రూ 10,000 కోట్ల వ్యయంతో రెండు వరసల దారుల అభివృద్ది - కనెక్టివిటీ - రోడ్డు ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి సంబంధించిన 38 ప్రాజెక్టులను చేపట్టినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.
కాగా, జాతీయ రహదారుల నిర్మాణాన్ని ఎన్.హెచ్.ఏ.ఐ చేపట్టగా మిగతా 38 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన పి.డబ్ల్యు.డికి అప్పగించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లకు సంబంధించి అనేక చోట్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వీటిలో చాలావరకు ఈ ఏడాదిలో పూర్తి కావలసి ఉందని తెలిపారు. అలాగే ఏపీలో నేషనల్ హైవేల విస్తరణ - అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్ట్ ల వివరాలన్నింటినీ ఒక పట్టిక ద్వారా ఆయన వివరించారు.
అందులో , విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుండి కృష్ణా నది మీద నిర్మించే వంతెన మీదుగా చినకాకాని వరకు 17.88 కిలోమీటర్ల అరువరుసల బైపాస్ రహదారి పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి అని తెలిపారు.అలాగే గొల్లపూడి నుండి చిన అవుటపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర ఆరు వరసల బైపాస్ రోడ్డు వలన విజయవాడ నగరంపై ట్రాపిక్ భారం చాలా వరకు తగ్గుతుందని - ఈ ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్టు వివరించారు. . వీటితోపాటు గుండుగొలను - దేవరాపల్లి - కొవ్వూరు సెక్షన్ల మధ్య కొత్తగా ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే చిలకలూరుపేట బైపాస్ రోడ్డును ఆరు వరులస రోడ్డుని నిర్మించనున్నారు. అలాగే గిద్దలూరు-వినుకొండ మధ్య 112 కి.మీ మేర రెండు వరసల రహదారిగా విస్తరిస్తున్నారు. ఇలా మొత్తం రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేయబోయే జాతీయ రహదారుల గురించి క్లుప్తంగా వివరించారు.