ఢిల్లీలో నయాగరా వాటర్‌ ఫాల్స్‌.. వైరల్ వీడియో

Update: 2021-09-02 04:32 GMT
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. దీనితో ఢిల్లీని ఆరెంజ్‌ జోన్‌ గా ప్రకటించింది వాతావరణశాఖ. ఢిల్లీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 24 గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షం కురియడంతో ఢిల్లీలో రహదారులన్నీ జలమయమయ్యాయి. గడిచిన 12 సంవత్సరాల లో కురిసిన వర్షాల లో ఇదే అత్యధికమని వాతావరణ నిపుణులు వివరాలు వెల్లడిస్తున్నారు.

చాలా చోట్ల ట్రాఫిక్ జాం కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం నుండి భారీ వర్షం కురియడంతో ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో ఐఎండి ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. కుండపోత వర్షాలు కారణంగా ఢిల్లీలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయాయి. ముందుగానే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. 2010 తర్వాత గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 112 మిల్లీమీటర్ల వర్షం కురియడం ఇదే అని అంటున్నారు.  ప్రస్తుతం ఢిల్లీలో కురిసిన వర్షానికి రోడ్లు తో పాటు చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లిపోయాయి.

తూర్పు, ఆగ్నేయం, ఈశాన్య, ఉత్తర ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, దాద్రి, మీరట్, మోడీనగర్‌ లోని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా ఢిల్లీ వర్షాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైర వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్‌ మీద వరద ప్రవాహం ఎక్కువవడంతో వర్షపు నీరు కింద ఉన్న రోడ్డు మీదకు పారుతోంది. అయితే ఇది చూడటానికి అచ్చం జలపాతం మాదిరి కనిపిస్తోంది. దీనిని సంజయ్‌ రైనా అనే ట్విటర్‌ యూజర్‌ తన అకౌంట్‌ లో పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఢిల్లీకి నయాగరా జలపాతం వచ్చింది. ఉత్తరాఖండ్‌ లోని కెంప్టీ వాటర్‌ ఫాల్‌ ను తలపిస్తోంది. ఇది ఢిల్లీ ప్రభుత్వ కొత్త 'కార్' వాష్ చేసుకునే ఫెసిలిటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News