కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ ను అడ్డం పెట్టుకుని స్లెడ్జింగ్ కు యత్నం

Update: 2020-06-14 17:30 GMT
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మధ్య ఏళ్లుగా ప్రేమాయణం సాగుతున్న సమయంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఓ టెస్టు సిరీస్‌ జరిగింది. ఈ ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ అనుష్కతో కలిసి వచ్చాడు. ఇది గమనించిన  ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ నిక్‌ కాంప్టన్‌  అనుష్క శర్మ ద్వారా స్లెడ్జింగ్ చేయాలని భావించాడంట. ఈ విషయాన్ని నిక్ కాంప్టన్ వెల్లడించాడు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు బహిర్గతం చేశాడు. అనుష్క శర్మను టార్గెట్‌ చేసి విరాట్‌ కోహ్లిని స్లెడ్జింగ్‌ చేయాలని భావించినట్లు తెలిపారు.

పోడ్‌ క్యాస్ వేదికగా లైవ్ సెషన్‌‌ లో పాల్గొన్న కాంప్టన్ 2012లో భారత పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అనుష్క శర్మతో తను మాట్లాడటం కోహ్లికి అస్సలు నచ్చేది కాదని కాంప్టన్‌ వివరించాడు. ఓ రోజు సాయంత్రం తన తోటి ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్ - యువరాజ్ సింగ్ - కోహ్లితో పాటు మరికొంతమంది సరదాగా బయటకు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో కోహ్లి ప్రియురాలు అనుష్క కూడా తమతోనే ఉందని వివరించారు. అప్పుడు అనుష్కతో మాట్లాడే ప్రయత్నం చేశానని.. ఆ సమయంలో అనుష్క తనతో బాగానే మాట్లాడిందని.. ఇద్దరం అనేక విషయాల గురించి మాట్లాడుకున్నట్లు వెల్లడించాడు. అయితే తామిద్దరం మాట్లాడుకోవడం కోహ్లికి నచ్చలేదని పేర్కొన్నారు. అందుకే ఆ సిరీస్‌లో తాను బ్యాటింగ్‌ కు వచ్చిన ప్రతీసారి అనుష్క నా గర్ల్‌ ఫ్రెండ్‌ అని చెప్పే కోహ్లీ ప్రయత్నం చేశాడని ఆసక్తికర విషయం తెలిపారు.

అప్పటికే కోహ్లి తన బాయ్‌ ఫ్రెండ్‌ అని అనుష్క చెప్పారని ఇదే విషయాన్ని టార్గెట్‌ చేసి స్లెడ్జ్‌ చేసి అతడి ఏకాగ్రతను దెబ్బతీయాలనుకున్నట్లు దాగి ఉన్న కుట్రను బహిర్గతం చేశాడు. నాగ్‌ పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ లో సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే ఇప్పటికీ ఆ ఘటనను గుర్తుచేసుకుంటే సరదాగా అనిపిస్తుంటుందని కాంప్టన్‌ తెలిపాడు.
Tags:    

Similar News