నిమ్మగడ్డ మరో సంచలనం: మంత్రులు, సలహాదారులకు ప్రభుత్వ వాహనాలు కట్

Update: 2021-01-30 17:59 GMT
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెలరేగిపోతున్నారని పరిణామాలను బట్టి తెలుస్తోంది.. పంచాయితీ ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ ఉండడంతో సర్వాధికారాలు కలిగి ఉన్న ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఫుట్ బాల్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ మరో సంచలన లేఖ రాశారు.

ఎన్నికల కోడ్ ఉన్నందున మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాలు వినియోగించరాదని ఆంక్షలు విధించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అమలు చేయాలని సీఎస్ కు సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మంత్రులు, సలహాదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించారు.ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనల్లో అధికారులు, ఉద్యోగులు పాల్గొనరాదని నిమ్మగడ్డ లేఖలో స్పష్టం చేశారు.

 దీనిపై వైసీపీ మంత్రులు, సలహాదారులు భగ్గుమన్నారు. తమను నియంత్రించడం ఏంటని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల వేళ సర్టిఫికెట్ల జారీలో జగన్ బొమ్మను తీసేయాలని ఆదేశించడం దుమారం రేపింది. ఇప్పుడు ఏకంగా మంత్రులకు వాహనాలు కట్ చేయడంపై ప్రభుత్వం ఉడికిపోతోంది.
Tags:    

Similar News