లీప్ బడ్జెట్ తొమ్మిదో సారి

Update: 2016-02-29 06:40 GMT
కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి పని దినం రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. కేంద్ర ఆర్థిక మంత్రి అశేష భారతీయుల ఆశల దిక్సూచిగా ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్ పట్ల సామాన్యుడి నుంచి బడా పారిశ్రామికవేత్తలూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.  అరుణ్ జైట్లీ 2016-17 వార్షిక బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. విశేషమేమిటంటే 1952 వ సంవత్సరం నుంచి ఇలా ఫిబ్రవరి 29న లోక్ సభలో బడ్జెట్ ఇది తొమ్మిదో సారి.

- ఫిబ్రవరి 29 న రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ కు దక్కింది.

- అలాగే... ఫిబ్రవరి 29 మొరార్జీ దేశాయ్ పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడు రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతా ఆయనదే.

- మొత్తం పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి కూడా మొరార్జీ దేశాయే..

ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురుఉన్నారు

1.       జవహర్ లాల్ నెహ్రూ

2.       ఇందిరా గాంధీ

3.       చరణ్ సింగ్

4.       హేమావతి నందన్

5.       బహుగుణ

6.       రాజీవ్ గాంధీ

7.       వీపీ సింగ్

8.       ఎన్డీ తివారీ

తమిళనాడు నుంచి ఆరుగురు

1.       ఆర్కే షణ్ముఖం చెట్టి

2.       టీటీ కృష్టమాచారి

3.       చిదంబరం సుబ్రమణియం

4.       ఆర్.వెంకట్రామన్

5.        జాన్ మధాయ్

6.       పి.చిదంబరం
Tags:    

Similar News