కర్ణాటకలోని కొడ్ గావ్ జిల్లా ఓ వైపు వరదలతో వార్తల్లో నిలుస్తుంటే...మరోవైపు హాట్ హాట్ రాజకీయ పరిణామాలతోనూ తెరకెక్కుతోంది. గత వారంలో ఆ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వరదలు పోటెత్తడంతో మొత్తం 11 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని - ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం అందించిన కర్ణాటక సీఎం కుమారస్వామి..కేంద్రంసహాయం కోరారు. దీంతో వరదలతో అతలాకుతలమైన కొడ్ గావ్ కు రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొడ్ గావ్ లో శుక్రవారం - శనివారం కేంద్రమంత్రి పర్యటించారు.
అయితే, తొలిరోజు పర్యటన సాఫీగానే సాగినప్పటికీ..రెండో రోజే ఆమె వివాదంలో చిక్కుకున్నారు. తొలిరోజు మీడియాతో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. తాను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున.. ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. కోటి ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కొడ్‌గావ్‌లో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి తక్షణమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి.. చర్యలు తీసుకుంటామన్నారు. కొడ్ గావ్ లో నెలకొన్న పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ - హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్తానని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, మరుసటి రోజు ఆమె పర్యటన రుసరుసలతో ముగిసింది. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కర్నాటక శుక్రవారం ఆమె కొడగు ప్రాంతంలో వరద బీభత్సాన్ని పరిశీలించారు. వరద పర్యటన చివరన కర్నాటక మంత్రి సారా మహేశ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతుండగానే మంత్రి మహేశ్ ``సమయం లేదు మేడం.. త్వరగా ముగించండి`` అని సూచించారు. అలా చెప్పడం ఆమెకు నచ్చినట్టు లేదు.
దీంతో నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. `కేంద్రమంత్రికి రాష్ట్రమంత్రి చెప్పడమా?ఇదంతా నమ్మలేకుండా ఉంది`` అని ఊగిపోయారు. ``మేడం కెమెరాలు ఇటే చూస్తున్నాయి`` అని మహేశ్ అంటే `కానీయండి` అని చిర్రుబుర్రులాడారు. మీడియావైపు చూస్తూ ``ఏమైనా రికార్డు చేసుకోండి`` అన్నారు. ఈ ప్రవర్తనను నిరసిస్తూ ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర ట్విట్టర్ లో విమర్శలు సంధించారు. వరద పనుల్లో తలమునకలుగా ఉన్న నా సహచరునిపై మీరు అలా విరుచుకుపడడం ఏమీ బాగాలేదండీ అని సూటిగానే చురకలు వేశారు. అయినా కేంద్రం ఎక్కువ - రాష్ర్టాలు తక్కువ అని ఎక్కడాలేదని - రెండూ సమానమేనని పేర్కొన్నారు. రాష్ర్టాలకు అధికారాలు కేంద్రం ఇవ్వదని, అవి రాజ్యాంగం నుండి వస్తాయని ఉపముఖ్యమంత్రి పరమేశ్వర కేంద్రమంత్రికి గుర్తుచేశారు. కాగా, కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా నెలకొన్న ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది.