ఆ ఆలింగనం కరెక్టేనా.. సీఎం గారు!

Update: 2020-03-24 13:03 GMT
కరోనా వ్యాప్తి కారణంగా వైరస్ ను అరికట్టడానికి, వైరస్ నుండి జనాలను కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా హీరో నితిన్ స్పందించి 10లక్షల రూపాయల చెక్కును సీఎం సహాయనిధి పేరిట సీఎం కెసిఆర్ నేడు సీఎం కెసిఆర్ చేతికి అందజేశాడు. ఈరోజు హీరో నితిన్ ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలుసుకొని తన సహాయ దృక్పథాన్ని చాటుకున్నాడు. ఈ క్రమంలో సీఎం కెసిఆర్ నితిన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించడం జరిగింది.

అయితే ఈ ఆలింగనం పై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. సోషల్ డిస్టెంసింగ్ గురించి తెలియజేయాల్సిన సీఎం కెసిఆర్ మనిషిని దగ్గరకు తీసుకోవడం కరెక్ట్ కాదని కొందరి వాదన. కొందరేమో హీరో నితిన్ విరాళం ప్రకటించడం బాగుంది కానీ అలా డైరక్ట్ కలిసి చెక్కును అందించే బదులు ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అంటున్నారు. అది కూడా నిజమే అన్పిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు అలాంటివి మరి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 36కి చేరింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7కి చేరగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నట్లు సమాచారం.
Tags:    

Similar News