ఇప్పటిదాకా జాతీయ రహదారులపైనే టోల్ ఫీజును వసూలు చేస్తుండగా ఇక నుంచి రాష్ట్ర రహదారుల నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా బాంబుపేల్చారు.
రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారుల విస్తరణ కోసం కేంద్రం ఒక పథకాన్ని రూపొందిస్తోందని గడ్కరీ తెలిపారు. రాష్ట్ర రహదారిని నాలుగు లేదా ఆరు లేన్ల రహదారిగా కేంద్రం విస్తరిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ఆ రోడ్లను తిరిగి ఇచ్చే ముందు 25 ఏళ్లపాటు టోల్ వసూలు చేస్తామని బాంబు పేల్చారు.
'మేము ఆ రహదారిని రాష్ట్ర ప్రభుత్వాల నుండి తీసుకుంటాము.. టోల్ వసూలు చేస్తాము,' అని గడ్కరీ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్ఛంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
ఒక నిర్దిష్ట రహదారిని 4-6 లేన్ క్యారేజ్‌వేగా విస్తరించడానికి పెట్టుబడి పెట్టిన డబ్బును 12-13 సంవత్సరాలలో తిరిగి పొందవచ్చని గడ్కరీ చెప్పారు.
అయితే, ఇందుకోసం కేంద్రం ఏదైనా రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందా లేదా దీని కింద ఉన్న మొత్తం వ్యయం భరిస్తుందా లేదా ఏదైనా ప్రైవేట్ సంస్థతో భాగస్వామ్యం చేయడం ద్వారా కార్యాచరణ చేపడుతుందా అనేదానిపై గడ్కరీ స్పష్టత ఇవ్వలేదు.
కాగా ముంబై–బెంగళూరు మధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించే యోచనలో ఉందని, దీని ద్వారా మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి కర్ణాటకకు ఐదు గంటల్లో ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు.
చాలా గ్లోబల్ కంపెనీలు భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఆటో కంపెనీల మొత్తం ఆదాయం ప్రస్తుతం రూ. 7.5 లక్షల కోట్ల నుంచి వచ్చే ఐదేళ్లలో రెండింతలు రూ. 15 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు.
విమానాశ్రయాల తరహాలో 'బస్ పోర్టు'లను రూపొందించే యోచన కూడా ఉందన్నారు. ప్రధాన బస్ డిపోలను లాడ్జీలు, రెస్టారెంట్లతో కూడిన సౌకర్యాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తుందని గడ్కరీ చెప్పారు.
కాగా ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్ ఫీజుతో బెంబేలెత్తుతున్న వాహనాదారులు ఇప్పుడిక కేంద్రం రాష్ట్ర రహదారులపైన కూడా టోల్ వసూలు చేస్తే జేబులు ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.