పోలవరం విషయంలో తాను రంగంలోకి దిగితే తప్ప.. పని చక్కబడే అవకాశం లేదన్నట్లుగా చంద్రబాబునాయుడు పదేపదే నొక్కి వక్కాణిస్తుంటారు. అదే క్రమంలో కేంద్రంతో చర్చలు జరిపి.. రాష్ట్రం చేస్తున్న డిమాండ్లకు అనుకూలంగా కేంద్ర నిర్ణయాలు ఉండేలా చూడడంలో కూడా రాష్ట్ర అధికారులు మంత్రి ఉమా విపలం అయ్యారని భావించి.. చంద్రబాబు తానే రంగంలోకి దిగారు. కొన్ని రోజుల కిందట కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం అయ్యారు. పోలవరానికి సంబంధించి.. అన్నీ గడ్కరీ ఒప్పుకునేశారని.. అనుకున్న గడువులోగా పనులు పూర్తి అయిపోతాయని ఆయన చాలా డాంబికంగా ప్రకటించేశారు. ప్రజలు కూడా అంతా నిజమే కాబోలు అనుకున్నారు.
తీరా చూడబోతే.. ఢిల్లీ వెళ్లి గడ్కరీతో భేటీ ద్వారా చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఢమాల్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే... చంద్రబాబునాయుడు ఏం డిస్కస్ చేశారో - ఏం తీర్మానాలు చేశారో.. పోలవరానికి సంబంధించి కేంద్రం ఏం నిర్ణయాలు తీసుకున్నదో.. ఎలా సహకరించబోతున్నదో.. చేసిన తీర్మానాలకు సంబధించి.. మినిట్స్ ఇప్పటిదాకా తయారు కానేలేదు. కేంద్రం చంద్రబాబుకు ఏం హామీలు ఇచ్చిందో మినిట్స్ ను ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వానికి వారు పంపనేలేదు. అప్పుడే పోలవరం పై మరో మీటింగు ఏర్పాటు చేస్తున్నారు. పనుల్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంలో ఇవాళ తాజా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇంచుమించుగా.. గతంలో చంద్రబాబుతో భేటీలో తీసుకున్న నిర్ణయాలను సాంతం బుట్ట దాఖలు చేసినట్లేనా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
కేంద్రం నుంచి ఒక చేత్తో డబ్బు తీసుకుని.. మరో చేత్తో కాంట్రాక్టరుకు ఇస్తూ.. పనులు మొత్తం ఏదో తామే చేసేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు ధోరణికి కూడా మంగళవారం జరిగే బేటీలో కేంద్రం చెక్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. సిమెంట్ స్టీల్ వంటి కొనుగోళ్లుతో ఇక రాష్ట్రానికి సంబంధం లేకుండా నేరుగా తామే కాంట్రాక్టరుకు సరఫరా చేసేస్తాం..అ ని కేంద్రం ప్రకటిస్తోంది. అలాగే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం వచ్చి పనుల్ని సమీక్షిస్తానని కూడా హామీ ఇచ్చారు. పోలవరం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రబాబు వారానికోసారి వీడియో సమీక్షలు చేసేవారు. అలాంటిది వేలకిలోమీటర్ల దూరంలో ఉండే గడ్కరీ రెండు వారాలకోసారి ప్రత్యక్షంగా విజిట్ చేసి సమీక్షించడం అంటే గొప్ప విషయం అని అంతా అనుకుంటున్నారు. కేవలం కేంద్రం శ్రద్ధ పెంచడం మాత్రమే కాదు.. చంద్రబాబు అదికారానికి కూడా గండి కొట్టేస్తున్నదని అంతా అనుకుంటున్నారు.