టీడీపీ, బీజేపీల మధ్య మాటల తూటాల స్థాయి అంతకంతకూ పెరిగిపోతోంది. గడచిన ఎన్నికల్లో కలిసే పోటీ చేసిన ఈ రెండు పార్టీలు... కేంద్రంతో పాటు ఏపీలోనూ అధికారం చేజిక్కించుకున్నాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఈ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన చేతగాని తనాన్ని కప్పిపెట్టుకునే ఉద్దేశంతో చంద్రబాబు... బీజేపీకి కటీఫ్ చెప్పి... గతంలో తాను పొడిగిన నోటితోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారును తనదైన శైలి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు కూడా ఎదురు దాడికి దిగడంతో పాటు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు... చంద్రబాబు సర్కారుపై ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. రెండు పార్టీల మధ్య సాగుతున్న మాటల తూటాలు ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత వేడిని పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే దాని కంటే కూడా బాబు పాలనపై విమర్శలు ఎక్కుపెట్టేందుకే ఆయన అధిక ప్రాదాన్యం ఇచ్చారని చెప్పాలి.
అయినా గడ్కరీ... చంద్రబాబు పాలనపై ఏ తరహా విమర్శలు సంధించారన్న విషయానికి వస్తే... చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన ఓ రేంజిలో కడిగిపారేశారు. ఏపీలో సాగుతున్న చంద్రబాబు పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని గడ్కరీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని చెబుతున్న చంద్రబాబు సర్కారు మాటల్లో ఇసుమంతైనా కూడా వాస్తవం లేదని ఆయన తేల్చి పారేశారు. గడచిన 50 ఏళ్లలో ఏపీలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలోనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఏపీకి నిధులను విడుదల చేస్తూనే ఉన్నామని చెప్పిన గడ్కరీ... తమ ప్రభుత్వం ఇస్తున్న నిధులతో అభివృద్ధి చేసుకుంటున్న చంద్రబాబు... మొత్తంత క్రెడిట్ నంతా తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు మొత్తం నిధులన్నీ కూడా కేంద్రమే విడుదల చేస్తున్నా... చంద్రబాబు సర్కారు మాత్రం పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని తామే నిర్మించినట్టుగా బడాయి పలుకులు పలుకుతోందని విమర్శించారు. ఏపీపై కేంద్రానికి చిన్నచూపన్న చంద్రబాబు మాటల్లో ఇసుమంత నిజం కూడా లేదని గడ్కరీ తేల్చి చెప్పారు. ఒకవేళ చంద్రబాబు చెబుతున్నట్లుగా ఏపీపై కేంద్రం వివక్ష చూపుతున్నట్లయితే... ఈ మేర నిధులు ఎలా వచ్చాయని కూడా ఆయన ప్రశ్నించారు.
ఇతర పథకాలన్నింటికీ తమ నిధులను వెచ్చించుకుంటూ సాగుతున్న చంద్రబాబు... లోటు బడ్జెట్ కింద ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లను బూచిగా చూపుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ నుంచి అన్ని అవసరాలు పొందిన పాత మిత్రులు... అప్పటిదాకా కలిసి సాగిన మిత్రులపై విమర్శలు గుప్పించడం ఏమేరకు సబబో టీడీపీ నేతలే ఆలోచించుకోవాలని హితవు పలికారు. పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని అయితే ఎక్కడా ఒక్క శాతం కూడా కేంద్రానికి క్రెడిట్ ఇవ్వకుండా అంతా తామే చేస్తున్నామనే బిల్డప్ టీడీపీ ఇస్తోందని గడ్కరీ ధ్వజమెత్తారు. కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని టీడీపీ ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో పసలేదని గడ్కరీ చెప్పారు. లెక్కలు అడిగితే కక్షసాధింపు చర్యలకు కేంద్రం పాల్పడుతోందనే అసత్య ప్రచారాలు చంద్రబాబు టీమ్ చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. గడ్కరీ ప్రసంగం తర్వాత మైకందుకున్న పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కూడా చంద్రబాబు సర్కారుపై తమదైన శైలిలో నిప్పులు చెరిగారు.