తరచుగా వార్తల్లో నిలిచే బీహార్ ఇప్పుడు రాజకీయవిమర్శల కారణంగా మరోమారు తెరమీదకు అదికూడా ఉప ఎన్నికల ద్వారా కావడం గమనార్హం. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షం ప్రయత్నం చేయగా... అదే రీతిలో సీఎం సైతం రియాక్టయ్యారు. బీజేపీ సీనియర్ నేత - యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బీహార్ లో బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదే పదే ఏదో అభివృద్ధి చేశానని చెప్పుకునే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. దీనికి నితీశ్ సైతం సిద్ధమయ్యారు. అయితే చిన్న మెలిక పెట్టారు.
రెండు రోజుల బీహార్ పర్యటనలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులతోనే బీహార్ లో అభివృద్ధి జరిగిందని అన్నారు. తాను చేసిన అభివృద్ధిపై నితీశ్ కు నమ్మకం ఉంటే.. 2019 వరకూ ఆగకుండా ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్.. మౌర్య సవాల్ కు తీవ్రంగా స్పందించారు. బీజేపీకి దమ్ముంటే యూపీలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని నితీశ్ అన్నారు. బీహార్ లో ఎప్పుడైనా ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని.. బీజేపీ నాయకులకు దమ్ముంటే యూపీలోనూ ఎన్నికలకు సిద్ధం కావాలని నితీశ్ ఘాటు సవాల్ విసిరారు. బీజేపీ సీనియర్ నేత విసిరిన సవాల్ - బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం అదే రీతిలో స్పందించడంతో నిజంగానే ఈ రెండు రాష్ర్టాల్లో ఉప ఎన్నికలు వచ్చేస్తాయా అనే రీతిలో రాజకీయాల్లో సందేహాలు మొదలయ్యాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/