ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి ఫోన్ వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్ ను ఫోన్ లైన్లో కోరారు.
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేది వరకు పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఆరుగురు రాజ్యసభ ఎంపీల బలం ఉంది.
2018లో కాంగ్రెస్ కు చెందిన బీకే హరిప్రసాద్ ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో మరోసారి ఆయన పోటీలో నిలిచారు. హరివంశ్ కోసం బీహార్ సీఎం ఏపీ సీఎం జగన్ సాయం కోరారు.
కాగా తెలంగాణ రాజ్యసభ ఎంపీ కేకేను కాంగ్రెస్ నామినేట్ చేయాలని చూస్తోంది. ఆయన ఒప్పుకుంటే మద్దతు ఇస్తామని అంటోంది. దీనిపై కేసీఆర్ నిర్ణయం ప్రకారం వెళుతానని కేకే అంటున్నాడు. ఒకవేళ టీఆర్ఎస్ ఎంపీ పోటీలో ఉంటే వైసీపీ మద్దతు ఎవరికి ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. బహుశా టీఆర్ఎస్ కే వైసీపీ మద్దతునిచ్చే అవకాశాలు ఉన్నాయి.