బీహార్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు నెలల్లో అక్కడ ఎన్నికలు జరుగుతుండడంతో అటు బీజేపీ. ఇటు జనతా పరివార్ కూటమి మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన నితీష్ కుమార్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు రెఢీ అవుతుండగా....మరోవైపు పీఎం మోడీ ఎట్టిపరిస్థితుల్లోను జనతా పరివార్ కూటమిని చిత్తుచేసి బీహార్‌లో కాషాయ జెండా ఎగరవేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
అక్కడ తనకు అత్యంత నమ్మకస్తుడైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను స్వయంగా రంగంలోకి దించి ఎత్తుకు పైఎత్తులు వేయిస్తూ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందంటే రెండు నెలలుగా అమిత్ షా పదే పదే బీహార్ వెళుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల్లో విజయం సాధించాలని అక్కడ పార్టీ నాయకులకు నూరిపోస్తున్నారు.
ఇటీవల మోడీ బీహార్ ప్రజలకు ఎన్నికల తాయిలంగా రూ 1.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి వారిని బీజేపీ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే మోడీకి ధీటుగా సీఎం నితీష్‌కుమార్ రూ 2.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి తనది మోడీని మించిన ప్యాకేజీ అని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్తు, మంచినీరుతో పాటు ఇతర నిత్యావసరాలు కూడా కల్పిస్తామని...వచ్చే ఐదేళ్లలో బీహార్‌లో ఈ 2.7 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని నితీష్ చెప్పారు. ఇవి నా హృదయంలోంచి వస్తున్న మాటలు (దిల్ కీ బాత్). మనసులోంచి వస్తున్న మాటలు (మన్ కీ బాత్) కావని ఆయన చెప్పారు. ఏదేమైనా నితీష్ మోడీకే షాక్ ఇస్తూ..ఇచ్చిన తాయిలాలు...ఆయన హృదయంలోనుంచి వచ్చిన మాటలు బీహార్ ప్రజల హృదయాలను ఎంత వరకు తాకుతాయో చూడాలి.