పార్లమెంటులో కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన 2019-20 వార్షిక బడ్జెట్ లో మెరమెచ్చు మాటలు. కంటితుడుపు చర్యలే ఎక్కువగా కనిపించాయి. ముఖ్యంగా ఆర్థిక శాఖా మంత్రి స్థానంలో ఓ మహిళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆసాంతం కూడా మహిళలను పొగుడుతూనే సాగినా.. వారికంటూ ఒనగూర్చిన ప్రయోజనాలు చాలా స్వల్పంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా మహిళలు ఎంతో ఎదురు చూస్తున్న కొన్ని స్వాంతనలు ప్రకటించకపోగా వారి కళ్లకు గంతలు కట్టే విధంగా కొన్నింటిని ప్రకటించడం చాలా వింతగొలుపుతోంది.
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళల భద్రతకు కేంద్రం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే 2013వ సంవత్సరం నుంచి ప్రతి కేంద్ర బడ్జెట్ లోనూ మహిళ భద్రతకు నిధులు కేటాయిస్తున్నారు. దీనికి నిర్భయ అనే పేరు వెయ్యి కోట్లతో ఫండ్ ప్రారంభించారు. మహిళల రక్షకు తీసుకునే చర్యలు - వినియోగించే సిబ్బంది జీత భత్యాలు - మహిళల భద్రతపై అవగాహన సదస్సులకు ఈ నిదులను ఖర్చు చేస్తారు. అదే సమయంలో బాధిత మహిళలల పునరావసం - నష్ట పరిహారం - పోషణ వంటి ఖర్చులకు కూడా ఈ నిధులను వినియోగిస్తారు. గత ఏడాది బడ్జెట్ లోనూ నిర్భయ ఫండ్ కు కేంద్రం 350 కోట్లు కేటాయించింది.
అయితే, అప్పట్లోనే ఆ నిధలను రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకోవడం లేదని లోపాన్ని ఎత్తి చూపిన కేంద్రం తాజా బడ్జెట్ లో నిర్భయ నిదుల ఊసే లేకుండా చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇక, ముద్ర రుణాలకు సంబంధించి ఈ దఫా రుణ పరిమితిని రూ. 100000 వరకు పెంచారు. అదే సమయంలో మహిళలు రుణ సహాయం కింద ఓవర్ డ్రాఫ్ట్ గా రూ. 5000 తీసుకునే దెసులుబాటు కల్పించామని ఆర్థిక మంత్రి నిర్మల ఘనంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదాపాయాన్ని పథకం ప్రారంభించిన 2016లోనే ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి పెంచాలని దేశవ్యాప్తంగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ.. కేంద్రం పట్టించుకోలేదు.
తాజా బడ్జెట్ లో అయినా ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి 25 వేలకు పెరుగుతుందని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో బ్యాంకులు ముద్ర రుణాలు ఇవ్వడంలో చాలా తాత్సారం చేస్తున్నాయని - ష్యూరిటీలు కోరుతున్నాయనే విమర్శలు - ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలాంటి ష్యూరటీ కూడా లేకుండానే ఇవ్వాల్సిన నిధులపై ఇలాంటి ఆంక్షలు నిధించడం ఔత్సాహిత మహిళా పారిశ్రామిక వేత్తలకు శరాఘాతంగానే పరిణమిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు ప్రతిపాదించకుండానే బడ్జెట్ ప్రసంగం ముగిసింది.