కాంగ్రెస్ కు ఏంటీ పరిస్థితి.?

Update: 2019-05-09 06:27 GMT
తెలంగాణలో వరుస ఎన్నికలతో కేసీఆర్ చెడుగుడు ఆడేస్తున్నారు. కోలుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వరుస దెబ్బలు తీస్తున్నాడు. అసెంబ్లీ షాక్ నుంచి తేరుకోకముందే 11 మంది ఎమ్మెల్యేలను కలిపేసుకొని తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని లేకుండా చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తెచ్చి మరింత కష్టాల్లోకి కాంగ్రెస్ పార్టీని నెట్టారు.

వరుస ఎన్నికలతో వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మరో పిడుగు వేశారు కేసీఆర్.. స్థానిక సంస్థల ఎమ్మెల్యే పోరును తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలుగా పోటీచేయడానికి కాంగ్రెస్ నుంచి అసలు అభ్యర్థులు దొరకడం లేదట.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఇంతటి దుర్భర స్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని పార్టీ వర్గాలు దీనంగా చెబుతున్నాయి.

అసెంబ్లీలో గెలుపుతో టీఆర్ ఎస్ ఊపు మీదుంది. అదే ఊపులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తెచ్చింది. ఆ తర్వాత  మున్సిపల్ ఎన్నికలను జూన్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 11 మంది కారెక్కేయడం.. పరిషత్ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ హావా ఉండడంతో అనవసరంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి ఖర్చు పెట్టుకోవడం దండగా అని.. టీఆర్ఎస్ నేతలే గెలుస్తారనే  అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదివరకు వరంగల్ నుంచి గెలిచిన కొండా మురళి కాంగ్రెస్ లో చేరి రాజీనామా చేశారు. ఇక నల్గొండ స్తానిక సంస్థల్లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కొడంగల్ లో గెలిచిన వేం నరేందర్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇలా ముగ్గురు రాజీనామా చేశారు. వీళ్ల సీట్ల భర్తీకి ఈసీ నోటిఫికేషన్ వేయగా.. టీఆర్ ఎస్ గాలిలో కనీసం పోటీచేయడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ముందుకు రాకపోవడం గమనార్హం.
    

Tags:    

Similar News