ప్రత్యేక హోదా అంశంపై విశాఖపట్నంలో గురువారం జరగాల్సిన నిరసన ప్రదర్శనకు ఊపు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఈ నిరసన కార్యక్రమం గురించి పలుమార్లు ప్రస్తావించి.. యువతలో కదలిక తెచ్చాడు జనసేన అధినేత. మూడు రోజులుగా ఆయన ఈ అంశం గురించే ట్వీట్లు గుప్పిస్తున్నారు. దీంతో పవన్ స్వయంగా ఈ నిరసనలో పాల్గొంటాడన్న ప్రచారం జరిగింది. ఐతే జనసేన పార్టీ వర్గాలు మాత్రం పవన్ విశాఖపట్నానికి వస్తాడో లేదో చెప్పలేకపోతున్నాయి. ఆ పార్టీ ప్రతినిధి శ్రీరాజు మాటల్ని బట్టి చూస్తే పవన్ రావడం సందేహంగానే కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి వస్తాడనే విషయంలో అధికారిక సమాచారం ఏదీ తమకు రాలేదని శ్రీరాజు తెలిపాడు. ఐతే పవన్ వచ్చినా రాకున్నా ఆయన ఆలోచనలకు అనుగుణంగా నిరసన కార్యక్రమం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పవన్ వస్తే కచ్చితంగా ఈ కార్యక్రమానికి ఊపు వస్తుందని.. యువత మరింత ఉత్సాహంగా పాల్గొంటుందని.. ఐతే పవన్ ఈ విషయంలో ఏమైనా చెబుతాడా అని ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రదర్శన శాంతియుతంగా ఉండాలని పవన్ కోరుకున్నారని.. ఆ రకంగానే చేస్తామని.. జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు. మామూలుగా నిరసన అంటే నల్ల దుస్తులు ధరిస్తారని.. ఐతే గణతంత్ర దినోత్సవాన్ని గౌరవిస్తూ తెలుపు దుస్తులతోనే ఈ కార్యక్రమంలో పాల్గొంటామని.. అందరూ తెల్ల టీషర్టులు ధరించి రావాలని ఆయన కోరారు. విశాఖ నిరసనకు తాను హాజరవుతానని జగన్ ప్రకటించిన నేపథ్యంలో పవన్ అక్కడికి రావడం సందేహంగానే కనిపిస్తోంది.తాను కూడా వస్తే శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తుతుందని పవన్ భావిస్తుండొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/