ఆ ఒక్క మీడియాకే వైసీపీ ప్లీనరీకి నో ఎంట్రీ

Update: 2017-07-09 06:54 GMT
జగన్ నోటి నుంచి రామా అన్న మాట వచ్చినా బూతు బూతు అని అరుస్తున్న ఓ మీడియా సంస్థకు వైసీపీ గట్టి షాకిచ్చింది.  నాగార్జున యూనివర్సిటీ వద్ద ఘనంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి ఆ మీడియాను అనుమతించలేదు.
    
నిజానికి పార్టీ ప్లీనరీ సందర్భంగా అన్ని ప్రింటు - ఎలక్ర్టానిక్ మీడియాలకు ముందే ఆహ్వానం పంపించారు. కానీ, పత్రిక - ఛానల్ నడుపుతున్న ఆ మీడియా సంస్థకు మాత్రం ఆహ్వానం పంపించలేదు. అయినా, ఆ మీడియా ప్రతినిధులు ప్లీనరీకి వచ్చారు. కానీ... ప్లీనరీ వద్ద అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మాత్రమే అనుమతిస్తూ - అక్రిడేషన్లను పరిశీలించారు. అక్రిడేషన్లపై ఆ పత్రిక - చానల్ పేరు ఉండడంతో కొందరు విలేకరులను - ఫొటోగ్రాఫర్లు - కెమేరామేన్లను తిప్పి పంపించారు.
    
నిజానికి సీఎం - రాష్ర్టపతి - రక్షణ సంస్థల అధికారిక కార్యక్రమాలు వంటి కొన్నిటికి మాత్రమే జర్నలిస్టులు అక్రిడేషన్లు చూపి లోనికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, సీఎం ప్రోగ్రాంలకు కూడా అక్రిడేషన్లు లేకున్నా కూడా జర్నలిస్టులు వెళ్తుంటారు. అలాంటిది వైసీపీ తనను పనిగట్టుకుని బద్నాం చేస్తున్న మీడియా సంస్థ ప్రతినిధులను గుర్తించేందుకే ఈ అక్రిడేషన్ ఎత్తుగడ వేసిందని అంటున్నారు. ఇటీవల రాష్ర్టపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు జగన్ పాదాభివందనం చేయగా దానిపైనా మసిపూసి మారేడు కాయ చేసి కథనాలు అల్లిన ఆ సంస్థకు గుణపాఠం చెప్పేందుకే వైసీపీ ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు.
Tags:    

Similar News