చంద్ర‌బాబుకు మోడీ అప్పాయింట్‌మెంట్ లేదా?

Update: 2021-10-23 08:30 GMT
టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. సోమ‌వారం ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న‌పైనా.. రాష్ట్రంలో టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడుల‌పైనా.. ఆయ‌న కేంద్రంలోని పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి.. ఇప్ప‌టికే.. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అప్పాయింట్ మెంట్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోనూ.. చంద్ర‌బాబు భేటీ అయి.. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో పార్టీ కార్య‌ల‌యంపై జ‌రిగిన దాడికి సంబంధించి చంద్ర‌బాబు.. కేంద్రానికి 36 పేజీల‌తో కూడిన లేఖ‌ను రాశారు.

దీనికి నాటి ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. క్లిప్పింగుల‌ను కూడా జ‌త చేశారు. ఇలా.. మొత్తానికి ఏపీలో జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న కేంద్రంలోని పెద్ద‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించుకు న్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే డీజీపీ విష‌యంపైనా.. చంద్ర‌బాబు ఫిర్యాదు చేయ‌నున్నారు. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఢిల్లీటూర్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని చంద్ర‌బాబు క‌లుస్తారా?  లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. మోడీకి సంబంధించి.. చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంట్ కోరారో.. లేదో.. ఇప్ప‌టికీ.. టీడీపీ వ‌ర్గాల నుంచి క్లారిటీలేదు.

కానీ, వైసీపీ నేత‌లు మాత్రం ఒక ఆస‌క్తికర విష‌యాన్ని చెబుతున్నారు. చంద్ర‌బాబుకు నరేంద్ర మోడీ అప్పాయింట్ ఇవ్వబోర‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. మోడీని క‌లిసే అవ‌కాశం లేద‌ని.. చంద్ర బాబు ఢిల్లీకి వెళ్లినా.. మోడీ ఆయ‌న‌కు అప్పాయింట్‌మెంట్ ఇచ్చే ఛాన్స్ లేద‌ని చెబుతున్నారు. దీనికి కొన్ని కార‌ణాలు స్ప‌ష్టంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబును మోడీ న‌మ్మ‌డం లేద‌నేది వైసీపీ నేత‌ల ప్ర‌ధాన మాట‌. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో అంటే .. ప‌ట్టుమ‌ని రెండున్న‌రేళ్ల కింద‌ట‌.. మోడీకి వ్య‌తిరేకంగా.. బాబు వ్య‌వ‌హ‌రించిన తీరును వారు ప్ర‌స్తావిస్తున్నారు.

మోడీ హ‌ఠావో.. నినాదంతో చంద్ర‌బాబు వేసిన అడుగుల‌ను ఇప్ప‌టికీ.. బీజేపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నార‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు నాడు.. మోడీని తీవ్రంగా వ్య‌తిరేకించిన వారితో.. అంటే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వంటివారితో బాబు జ‌త‌క‌ట్టి.. మోడీని ప్ర‌ధాని పీఠం నుంచి దింపేసేలా వ్య‌వ‌హ‌రించిన విష‌యం.. ఇంకా మోడీ మ‌దిలో తార‌ట్లాడుతూనే ఉంద‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్‌తో వేదిక పంచుకున్న చంద్ర‌బాబును మోడీ ఎలా న‌మ్ముతార‌ని.. అంటున్నారు.

ఇలా ఏవిధంగా చూసుకున్నా.. చంద్ర‌బాబును న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎంపీలు ప్ర‌య‌త్నిస్తున్నా.. లాబీయింగ్ చేస్తున్నా.. మోడీ నుంచి అప్పాయింట్ మెంట్ వ‌చ్చే అవ‌కాశం చంద్ర‌బాబు క‌లిసే అవ‌కాశం.,. క‌న్నీరు పెట్టుకునే ఛాన్స్ వంటివి లేవ‌ని.. వైసీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. 
Tags:    

Similar News