క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో హీరోను దెబ్బ తీయటానికి విలన్ నిషేధిత మందుల్ని ఉపయోగించి హీరోను దెబ్బ తీయటం చూస్తుంటాం. కొన్నిసార్లు తెలివిగా వాటిని వాడేసి హీరోను అధిగమించటం చూస్తారు. ఇందుకు అవసరమైన డోపింగ్ టెస్టును మేనేజ్ చేయటం చూస్తాం. ఇదంతా వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది. కానీ.. ఒక దేశమే క్రీడల్లో రాణించేందుకు పక్కదారి పడితే? కలలో కూడా ఊహించని ఈ దారుణానికి పాల్పడిన రష్యా అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. క్రీడా ప్రపంచం.. క్రీడాకారులు.. క్రీడాభిమానులు ఛీ.. ఛీ అనేలా చేసిన ఈ దారుణ ఉదంతం ఐదేళ్ల క్రితం బయటకు రాగా.. తాజాగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తీవ్ర చర్యను తీసుకుంది. ఏకంగా నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ క్రీడలకు రష్యాను దూరంగా ఉండాలని ఆదేశించారు. అంటే.. రష్యాను వాడా బ్యాన్ చేసిందన్న మాట.
డోపింగ్ తో అత్యుత్తమ క్రీడా ప్రదర్శన చేసేలా తన క్రీడాకారుల్ని తయారు చేసే దుర్మార్గమైన చర్యను రష్యా చేపట్టింది. దీని కోసమే ప్రభుత్వ వ్యవస్థలే క్రీడాకారులకు అండగా నిలిచేవి. డోపింగ్ టెస్టుల్ని ట్యాంపర్ చేయటం.. భిన్నమైన రిపోర్టులు ఇవ్వటం లాంటి దరిద్రపుగొట్టు పనులు చేసేవారు. దీనికి సంబంధించిన సంచలన రిపోర్టును జర్మన్ టీవీ ఛానల్ ఒకటి డాక్యుమెంటరీ రూపంలో ఐదేళ్ల క్రితం ప్రపంచం ముందు పెడుతూ 2014 డిసెంబరులో టెలికాస్ట్ చేసింది. ఇదో సంచలనంగా మారింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది వాడా.
వారు జరిపిన విచారణలో మాస్కోలోని ల్యాబుల్లో ఇచ్చినట్లు చూపించిన ఫలితాలన్ని నిజాలు కావని.. అన్ని నకిలీవిగా తేలింది. ఆటగాళ్ల రక్త.. మూత్ర నమూనాలు నిషేధిత మందుల్ని వాడినట్లు తేలినా.. వాటిని మార్చేసి.. ఏమీ లేవన్నట్లుగా రిపోర్టులు ఇచ్చి క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగేలా దుర్మార్గమైన ప్లాన్ వేసింది. అది కాస్తా వికటించి.. ఇప్పుడు అసలు నిజం బయటకొచ్చి రష్యాకు చెరిగిపోలేని మచ్చను పడేలా చేసింది.
ఇప్పుడేం జరగనుంది?
తాము ఎన్నిసార్లు హెచ్చరించినా తన బుద్ధి మార్చుకోని రష్యాకు వాత పెట్టిన వాడా.. నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ క్రీడలకు రష్యాను దూరంగా పెట్టేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్జాతీయ క్రీడా సమాజం రష్యాను గెంటేసిందని చెప్పాలి. దీంతో 2020లో టోక్యోలోజరిగే ఒలింపిక్స్ తో పాటు.. 2020లో జరిగే పారాలింపిక్స్.. 2022లో జరిగే యూత్ ఒలింపిక్స్.. 2022లో బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ దేనిలోనూ రష్యా జాతీయ పతాకం కనిపించదు. జాతీయ గీతం వినిపించదు. రష్యన్ జట్లు ఏవీ ఈ క్రీడల్లో పాల్గొనదు. అంతేకాదు.. ఈ నాలుగేళ్లలో ఆ దేశం అంతర్జాతీయ క్రీడా పోటీలకు అతిధ్యం ఇచ్చేందుకు అవకాశం ఉండదు.
మరి డోపింగ్ మచ్చ లేని రష్యా క్రీడాకారుల పరిస్థితి ఏమిటంటే.. వారికి కొంత వెసులుబాటును కలుగజేసింది వాడా. వారు స్వతంత్ర హోదాలో పాల్గొనొచ్చు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పతాకం కింద పోటీల్లోకి దిగొచ్చు. ఒకవేళ వారు పతకం గెలిచినా రష్యా సాధించినట్లుగా నమోదు కాదు. అయితే.. వచ్చే ఏడాది రష్యాలో జరిగే కొన్ని యూరో ఫుట్ బాల్ మ్యాచులకు.. ఫార్ములావన్ రేసు నిర్వహణకు మాత్రం అనుమతి ఇచ్చారు. తాము విధించిన బ్యాన్ పై అప్పీలుకు రష్యాకు వాడా అవకాశమిచ్చింది. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టులో సవాలు చేసేందుకు 21 రోజుల వ్యవధి ఇచ్చింది. వ్యక్తులు తప్పు చేస్తే నష్టం వారికే పరిమితమవుతుంది. కానీ.. వ్యవస్థ దుర్మార్గాలకు పాల్పడితే.. ప్రపంచం ముందు దోషిగా నిలవాల్సి వస్తుంది. రష్యా ప్రస్తుత పరిస్థితి ఇలాంటిదేనని చెప్పక తప్పదు.