కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్..బ్రోక‌ర్లు..జోక‌ర్లు - హ్యాక‌ర్లు

Update: 2018-08-13 11:56 GMT
ఓ వైపు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం మ‌రోవైపు ఆయా పార్టీల సీనియ‌ర్ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌ పై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్న నేప‌థ్యంలో కొత్త కొత్త స‌మీక‌ర‌ణాలు - విమ‌ర్శ‌లు - ఆరోప‌ణ‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కులుగా ముద్ర‌ప‌డ్డ కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ ఎస్ పార్టిలో చేరడం. ఇందుకు సంబంధించి వివిధ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీన్ని నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ నాయ‌కుడు - మంత్రి జగదీశ్‌ రెడ్డి కొట్టిపారేశారు. అంతేకాకుండా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ పై విరుచుకుప‌డ్డారు. రోజుకో మాట పూటకో చిత్తం చెప్పే బ్రోకర్లు-జోకర్లు-హ్యాకర్లు టీఆర్ ఎస్ పార్టికి అక్కరేలేదని ఆయన వ్యాఖ్యానించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారు ఎటు పోతున్నారో ...ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `అటువంటి వారు చేరాల్సింది టీఆర్ ఎస్ పార్టిలో కాదు మానసిక వైద్యుడి దగ్గర` అంటూ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

నల్గొండలో జిల్లా ప్రజాపరిషత్ నూతన భవనాన్ని సోమవారం మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమవేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అంటే ప్రజలు భయపడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ కొరవడిందని, అటువంటి సమయంలో జరుగుతున్నా రాహుల్ గాంధీ పర్యటనకు జనం రారని గ్రహించిన కాంగ్రెస్‌ నేతలు ఈ తరహ ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం జరిగిన తొలి-మలి ఉద్యమాల్లో వందలాది మందిని పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేతగా వస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే ప్రజలలో ఇప్పటికి అదే భయం ఉంది ఉంటుందన్నారు.రాహుల్ గాంధీ అంటే ఆయన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోనే భ‌యపడరని అటువంటిది తెలంగాణా రాష్ట్రంలో ఎందుకు భ‌య‌పడుతారని మంత్రి జగదీష్ రెడ్డి ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News