కరోనా కారణంగా ప్రభావితం కాని రంగమంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఏదోలా నష్టపోయేలా చేస్తున్న ఈ మహమ్మారి కారణంగా తాజాగా మీడియా సంస్థలు ఊహించని రీతిలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. టీవీ చానళ్లలో ఒకలాంటి సమస్యలు ఉంటే.. ప్రింట్ మీడియాలో ఇప్పుడున్న పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.. విదేశీ వైద్యులతో పాటు.. స్వదేశానికి చెందిన వైద్యులు పలువురు కరోనా వైరస్ ను నిర్మూలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వీడియోలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
వాటిల్లో ప్రధానంగా చెబుతున్నవి.. ఇంట్లోకి వచ్చే సామాన్ల ద్వారా కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగా ఇంటికి వచ్చే పాలపాకెట్లు.. ఇతర సామాన్లను విధిగా శుభ్రం చేయాలని.. ఆ తర్వాతే వినియోగించాలని కోరుతున్నారు. అదే రీతిలో దినపత్రికల కారణంగా వైరస్ వ్యాప్తి చెందే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమాచారం వైరల్ గా మారటంతో.. గడిచిన మూడు రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో న్యూస్ పేపర్ల డిమాండ్ 20 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు.
మొన్నటివరకూ పాఠకుల నుంచి దినపత్రికను తమ ఇంటికి వేయొద్దన్న రిక్వెస్టులు చేస్తుంటే.. ఈ రోజు (సోమవారం) నుంచి ఇంటికి పేపర్లు వేసే కుర్రాళ్లు మొదలు హ్యాకర్స్ వరకూ కరోనాకు భయపడుతున్నారు. తమ ఇంట్లో వారు పేపర్లను డెలివరీ చేసే పనిని తాత్కాలికంగా ఆపాలని ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతో ఈ రోజు నగరంలో చాలాచోట్లకు దినపత్రికలు వెళ్లలేదు. పలువురు డెలివరీ బాయ్స్ సైతం విధులకు డుమ్మా కొట్టినట్లు చెబుతున్నారు.
కరోనా పుణ్యమా అని ఇప్పటికే ప్రకటనల పోటు పడిన ప్రింట్ మీడియాకు.. తాజాగా డెలివరీ బాయ్స్ తో పాటు.. కొందరు ఏజెంట్లు పేపర్లను డెలివరీ చేసే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇది మీడియా సంస్థలకు శరాఘాతంగా మారింది. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నది ఇప్పుడు వారికో సవాలుగా మారింది. ఈ సెంటిమెంట్ అంతకంతకూ పెరిగితే.. రానున్న నాలుగైదు రోజులకే.. దినపత్రికలు బంద్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్న మాట వినిపిస్తోంది.