2020లో ఉన్నా.. అంతరిక్షాన్ని అధిరోహిస్తున్న కులాల ప్రాతిపదికన అంటరానితనం.. వివిక్ష ఇప్పటికీ ఇప్పటికీ మన సమాజంలో కొనసాగుతూనే ఉంది. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు తలదించుకునేలా.. సిగ్గుపడేలా ఉంటున్నాయి.
ఒడిశాలో తాజాగా ఒక వృద్ధుడు చనిపోయాడు. కరోనా టైం కావడం.. తక్కువ కులం కావడంతో అతడి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. గ్రామం నుండి ఎవరూ సహాయం చేయలేదు. దీంతో బోలంగీర్ జిల్లాలోని లంకబహల్ గ్రామంలో తండ్రి శవాన్ని సైకిల్ పై తరలించాడు ఆ కొడుకు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
బాధితుడిని అఖయా పాట్రాగా గుర్తించారు. అతని కుటుంబం తక్కువ కులానికి చెందినది. ఈరోజే కన్నుమూశాడు. గ్రామస్తులు ఎవరూ వీరి అంత్యక్రియలకు సహాయం చేయకపోవడంతో అఖాయ కొడుకు తన తండ్రి శవాన్ని ఒక గుడ్డలో కట్టి సైకిల్‌పై శ్మశానవాటికకు తీసుకువెళ్ళాడు. ఈ అమానవీయ సంఘటన సమాజంలోని అసృష్యతను చూపిస్తోంది. ఇలాంటి ఘటనలు సభ్యసమాజానికే తీరని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
ఆశ్చర్యకరంగా ఈ దారుణంపై బోలంగీర్ జిల్లా కలెక్టర్ వింత వ్యాఖ్యలు చేశాడు, అఖాయ కుమారుడు ఎటువంటి సహాయం అడగలేదని..అందుకే ఎవరూ ముందుకు రాలేదని సర్ధిచెప్పాడు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుందని పేర్కొన్నాడు.