రెండు సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో సరికొత్తగా అవతరించింది. మన దేశంలోకి ఈ కొత్త వేరియంట్ ప్రవేశించిన నెలరోజుల్లోనే కరోనా కేసులు లక్షల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి రోజు సగటున లక్షన్నరకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి అంటే పరిస్థితి ఎంత చేయి దాటి పోతుందో అర్థం అవుతోంది. తాజాగా ఈ ఒమిక్రాన్ వైరస్‌ను బూస్టర్ డోసులు కూడా ఆపలేవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఒమిక్రాన్ ఆల్‌మోస్ట్ అన్‌స్టాపబుల్ అని ముంబైకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ చెప్పారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ శాస్త్రీయ సలహా సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది ప్రతి ఒక్కరిని పలకరిస్తుందని.. అయితే ఈ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఈ లక్షణాలు ఉన్న విషయం కూడా తెలియదని చెప్పారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని.. ఇక ఈ వైరస్ కట్టడికి తాము బూస్టర్ డోస్ సూచించడం లేదని.. అయితే ముందు జాగ్రత్త చర్యగా డోస్ వేసుకోవాలని చెపుతున్నామని సూచించారు.
ఇక 60 ఏళ్లు పై బడిన వారు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా ఉపయోగం ఉండడం లేదని కూడా చెప్పారు. ఇక లాక్‌డౌన్ గురించి ఆయన మాట్లాడుతూ భారతీయుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ అని.. మనకు మొదటి డోసే బూస్టర్ డోస్ కింద లెక్క అని ఆయన చెప్పారు. ఇక కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు కొన్న మార్గదర్శకాలు జారీ చేసింది.
అన్ని వైద్య కేంద్రాల వద్ద 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హాస్పటల్స్ వద్ద లిక్విడ్ మొడికల్ ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసి ఉండాలని... ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్ల పనితీరు సరిగా ఉండేలా చూసుకోవడంతో పాటు సిలిండర్ల లభ్యత ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. వైద్య కేంద్రాల వద్ద ఆక్సిజన్ పంపిణీ విషయంలో శిక్షణ పొందిన సిబ్బంది సేవలను మాత్రమే వాడుకోవాలని సూచించింది.