సంచలన ప్రకటన చేసిన సీఎం.. కరెంటు బిల్లు కట్టక్కర్లేదట

Update: 2019-08-01 08:24 GMT
ఎన్నికలు దగ్గరకు వస్తుంటే రాజకీయనేతల తాయిలాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందునా మోడీ లాంటి ప్రత్యర్థి వెంటాడుతుంటే చేజారే పవర్ ను నిలుపుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందుకే కాబోలు.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. సామాన్యుడి హితం కోరి తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు.

. ‘ఫ్రీ లైఫ్‌ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీం’లో భాగంగా నెలకు 200 యూనిట్లు లోపు కరెంటును వాడుకునే వారికి ఉచితంగా విద్యుత్ అందిస్తామని.. వారెలాంటి బిల్లు కట్టక్కేర్లేదని ప్రకటించారు. అంతేకాదు.. 201 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకూ కరెంట్ వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ కల్పిస్తామని.. బిల్లులో సగం చెల్లిస్తే సరిపోతుందని కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న టారిఫ్ ప్రకారం 200 లోపు యూనిట్ల వినియోగానికి ఢిల్లీలో రూ.622 బిల్లు చెల్లించాల్సి ఉంటేది. చాలామంది సామాన్య.. మధ్యతరగతి వారికి ఈ స్థాయి బిల్లు వస్తుంది. అలాంటి వారంతా ఇకపై నెలసరి ఎలాంటి బిల్లు కట్టకుండా విద్యుత్ వాడేసుకోవచ్చు.

తాజాగా క్రేజీవాల్ ప్రకటించిన పథకం ప్రకారం ఎంత కరెంటు వినియోగించుకున్న వారు ఎంత బిల్లు కట్టాలన్న విషయాన్ని చూస్తే.. ఇప్పటివరకూ 250 యూనిట్ల వినియోగానికి రూ.800చెల్లించే వారు ఇకపై రూ.252 చెల్లిస్తే సరిపోతుంది. అదే సమయంలో 300 యూనిట్ల విద్యుత్ వినియోగానిక ఇప్పటివరకూ రూ.971 చెల్లించేవారు. తాజాగా సీఎం ప్రకటన నేపథ్యంలో రూ.526 చెల్లిస్తే సరిపోతుంది. ఇక.. 400 యూనిట్లు వాడే వారు ఇప్పటివరకూ రూ.1320 చెల్లిస్తే.. ఇకపై రూ.1075 చెల్లిస్తే సరిపోతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిని చూసైనా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి పథకాన్ని ప్రవేశ పెడితే ఎంత బాగుంటుందో కదా?
Tags:    

Similar News