సాఫ్ట్ వేర్ జాబులు స్టాప్.. నో రిక్రూట్ మెంట్

Update: 2022-10-27 04:21 GMT
ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలు కరోనాకు ముందు.. తర్వాత అన్నట్టుగా మారిపోయాయి.  జీవితంపై ఎన్నో ప్లాన్లు చేసుకున్న సామాన్యులకు, ప్రణాళికలు రచించుకున్న పారిశ్రామిక వర్గాల కలలను మొత్తం కూల్చేసింది కరోనా.. అందరినీ రోడ్డున పడేసింది. ఇప్పుడు బతకడమే కష్టంగా మార్చేసింది. కరోనా దెబ్బకు ఇప్పుడు అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ సడలింపులు.. కీలక పరిశ్రమలు తెరిచిన తర్వాత కూడా మాంద్యం మబ్బులతో ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

ఈ జూలై నెలలో దేశవ్యాప్తంగా నియామకాల ప్రక్రియ అంతకుముందు నెలతో పోలిస్తే 5శాతం పెరిగిందని నౌకరీ జాబ్ సీక్ నివేదకలో వెల్లడైంది. అయితే ఈ నియామకాలు ఎక్కువగా మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో 36శాతం.. హెచ్.ఆర్ లో 37శాతం, నిర్మాణ ఇంజనీరింగ్ రంగాల్లో 27శాతంగా ఉన్నాయని తెలిపింది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగంలో 16శాతం , ఆటోమొబైల్స్ 14శాతం, టెలికాం పరిశ్రమలో 13శాతం మేర నియామకాల ప్రక్రియలో వృద్ధి నమోదైంది. ఐటీ హార్డ్ వేర్ రంగంలో 9శాతం నియామకాలు జరిగాయి. ఐటీ సాఫ్ట్ వేర్ రంగంలో ఎలాంటి నియామకాల జోరు కనిపించలేదని నౌకరీ జాబ్ స్పీక్ పేర్కొంది.

ఇక ఇవే కాదు.. నియామకాల్లో ఈ రంగాల్లో భారీగా కోతపడింది. విద్యాబోధనా రంగంలో మైనస్ -22శాతం, ఆతిథ్యరంగంలో -5శాతం, రిటైల్ లో -2శాతం మేర నియామకాల ప్రక్రియలో క్షీణత నమోదైంది.

తాజాగా ఐటీలో ట్రెండ్ దారుణంగా పడిపోయింది. ఆర్థిక మాంద్యం ప్రభావం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై పడింది. మాంద్యంపై కంపెనీలు చేపట్టిన నియంత్రణ చర్యలతో క్యాంపస్ ప్లేస్ మెట్లలో ఎంపికైన వారిని చేర్చుకోవడంలో జాప్యం నెలకొంది. కొందరికి ఆఫర్ లెటర్స్ రాకపోగా.. చాలామందికి రిజెక్ట్ చేసినట్టు మెయిల్స్ వస్తున్నాయి. దీంతో ఒకే ఉద్యోగాన్ని నమ్ముకొని మిగతా ఉద్యోగాలు వదిలేసిన విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. అటు కంపెనీలూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

ఇలా అన్నింటిలోనూ నియామకాల జోరు కనిపించగా.. లక్షల జీతాలు వచ్చే కలల సాఫ్ట్ వేర్ రంగంలో మాత్రం ఎలాంటి నియామకాలు లేకపోవడం ఆ రంగాన్ని కుదేలు చేస్తోంది. అమెరికా సహా దేశంలో ఐటీ జాబుల మోజులో పడిన యువ ఇంజినీరింగ్ పట్టభద్రుల ఆశలను అడియాసలు చేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News