ప్రపంచం మొత్తం ఈ వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 52 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 334,672 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. అగ్రరాజ్యం అమెరికా మొదలుకుని యూరప్ దేశాలన్నీ దీని బారిన పడి అల్లాడుతున్నాయి. 2019 నవంబర్లో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి కొన్ని వారాల్లోనే ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది.
రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యతో ఆయా దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా మహమ్మారి కేసులు భారీగానే పెరుగుతున్నాయి.ఇప్పటివరకు ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక కేసులు(1,620,902), మరణాలు(96,354) సంభవించాయి.
అయితే, ఇప్పటివరకు ఈ మహమ్మారి కోరలకు దొరకని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఆ దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ దేశాలు ఏవంటే. కిరిబాటి, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, ఉత్తర కొరియా, పలావు, సమోవ, సోలమన్ దీవులు, టోన్గా, తుర్క్‌మొనిస్తాన్, తువాలు, వనౌటులలో ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదు.