అస‌ద్.. మీ వాటా మీకు ఇచ్చేశాం!

Update: 2019-06-03 04:45 GMT
బీజేపీ.. మ‌జ్లిస్ మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం మ‌రోస్థాయికి చేరుకుంది. దేశంలో ఎక్క‌డ ఉగ్ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నా.. దాని మూలాలు హైద‌రాబాద్ లో క‌నిపిస్తున్నాయ‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు తాజాగా కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.. భార‌త్ లో ముస్లింలు అద్దెకు ఉండ‌టం లేదంటూ ఘాటుగా బ‌దులిచ్చారు.  

ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల సంవాదంలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చారు బీజేపీ నేత మాధ‌వ్ భండారీ. ఈ దేశంలో ముస్లింలు వాటాదారుల‌ని.. కిరాయిదార్లు కాద‌ని ఓవైసీ పేర్కొన‌గా.. దానికి బ‌దులిచ్చిన బీజేపీ.. 1947లో జ‌రిగిన దేశ విభ‌జ‌న స‌మ‌యంలోనే ముస్లింల‌కు వారి వాటా ఇచ్చేసిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఓవైసీ ఆలోచించి మాట్లాడాల‌ని.. ఆయ‌న్ను ఎవ‌రూ కిరాయిదారు అన‌లేద‌న్నారు. కిష‌న్ రెడ్డి మాట‌కు ఓవైసీ ఘాటు బ‌దులిస్తే.. దానికి అంత‌కు మించిన తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యారు మాధ‌వ్ భండారీ. ముస్లింల‌కు 1947లోనే వారి వాటా వారికి ఇచ్చేశామ‌న్న మాట‌లు ఇప్పుడు సరికొత్త చ‌ర్చ‌కు తెర తీయ‌ట‌మే కాదు.. ఓవైసీ మ‌రింత ఘాటుగా వ్యాఖ్యానించటం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.




Tags:    

Similar News