ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో తమపై చేసిన ఆరోపణలకు గానూ హెరిటేస్ సంస్థ పరువు నష్టం దావా వేసింది. ఈ కేసు ఇప్పటికే విచారణలో ఉంది.
హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే.. ఈ కేసులో వీరిద్దరూ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయినప్పటికీ.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వీరు విచారణకు హాజరు కాలేదు. దీంతో వీరిపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంటు జారీచేసింది.
అనంతరం ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. కాగా.. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారి కేసుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై నమోదైన కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగానే ఈ కేసు విచారణ వేగవంతమైంది.