షాక్: ఉత్త‌ర కొరియా వెనుక ట్రంప్ స్నేహితుడు?

Update: 2017-08-15 09:02 GMT
పైకి చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరు రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. నేత‌ల వ‌ర‌కే కాదు.. ఆయా దేశాలు సైతం తాము చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు ఏమాత్రం సంబంధం లేకుండా వ్య‌వ‌హ‌రించ‌టం మామూలే. తాజాగా అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శిస్తోందన్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది ట్రంప్ దోస్త్ గాచెప్పుకునే ర‌ష్యా .

ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు ద్వంద నీతిని పాలిస్తూ.. త‌మ వ్యాపార అవ‌కాశాల్ని పెంచుకోవ‌ట‌మే త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌ని ప‌రిస్థ‌తి. యుద్ధం వ‌స్తుంద‌టే ఆందోళ‌న చెందే వారెంద‌రో.. ఆనందించే వారు అంతేమంది ఉంటారు. ఎందుకంటే.. ఇద్ద‌రు కొట్టుకుంటుంటే వారికి అవ‌స‌ర‌మైన ఆయుధాల్ని అందించే వ్యాపార అవ‌కాశం అప్పుడే వ‌స్తుంది. అందుకే.. కొన్ని దేశాలు అదే ప‌నిగా నిప్పు రాజేసే ప్రోగ్రామ్‌ లో ఉంటాయి. ఈ మ‌ధ్య కాలంలో అదే ప‌నిగా అగ్ర‌రాజ్యంపై కాలు దువ్వుతున్న ఉత్త‌ర‌కొరియా వెనుక ఉన్న‌ది మ‌రెవ‌రోకాద‌ని.. ర‌ష్యానే అన్న అనుమానాలు రోజురోజుకీ బ‌ల‌ప‌డుతున్నాయి. ఎందుకంటే.. ఉత్త‌ర‌కొరియాకు సొంతంగా బాలిస్టిక్ మిస్సైల్స్‌ ను త‌యారు చేసుకునే సామ‌ర్థ్యం లేదు. ఈ సందేహం అమెరికాకు ఉన్న‌ప్ప‌టికీ.. అదే ప‌నిగా ప్ర‌యోగాల మీద ప్ర‌యోగాలు చేస్తున్న ఉత్త‌ర‌కొరియా తీరుతో అమెరికా ఒక అంచ‌నాకు రాలేక‌పోయింది. అయితే.. ఇటీవ‌ల  ఉత్త‌ర‌కొరియా రాకెట్ ప్ర‌యోగంలో తీసిన కొన్ని ఫోటోలు.. వీడియోల‌ను ప‌రిశీలించిన అమెరికాకు.. ర‌ష్యా ద్వంద‌నీతి అమెరికాకు అర్థ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. ఉత్త‌ర‌కొరియా అణుక్షిప‌ణి రాకెట్ ఇంజిన్ ల‌ను ఉక్రెయిన్ లోని ఒక ఫ్యాక్ట‌రీలో త‌యారు చేస్తున్న‌ట్లుగా కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చి స్ప‌ష్టం చేశాయ‌ని చెబుతున్నారు. నిజానికి ఉత్త‌ర‌కొరియాకు చైనాతో బ‌ల‌మైన సైనిక సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ.. సాంకేతిక స‌హ‌కారాన్ని ర‌ష్యా నుంచి తీసుకోవ‌టం అమెరిక‌న్ల‌కు షాకింగ్ గా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఉత్త‌ర‌కొరియాకు..ర‌ష్యాకు మ‌ధ్య‌నున్న సంబంధాల‌పై అనుమానాల‌కు ఈ మ‌ధ్య‌న ర‌ష్యా అధ్య‌క్షుడు జీ 20 దేశాల స‌మ్మిట్ లో చేసిన ప్ర‌క‌ట‌న కూడా కార‌ణంగా చెబుతున్నారు.

ఉత్త‌ర‌కొరియా ప‌ట్ల ఎవ‌రూ స‌హ‌నం కోల్పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. త్వ‌ర‌లో తానే స్వ‌యంగా ఆ దేశాధ్య‌క్షుడు కిమ్ జాంగ్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని పుతిన్ చెప్ప‌టాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఓవైపు ఉత్త‌ర‌కొరియాను నియంత్రిస్తున్న‌ట్లుగా ప్ర‌పంచానికి చెబుతూనే మ‌రోవైపు ఆ దేశానికి అవ‌స‌ర‌మైన అణ్వ‌స్త్రాల్ని అంద‌జేస్తున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ర‌ష్యా డ‌బుల్ గేమ్‌పై అగ్ర‌రాజ్యం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.           
Tags:    

Similar News