అగ్రదేశం అమెరికాకు కొరకరాని కొయ్య ఉత్తర కొరియా సవాల్ విసురుతోంది. అగ్రరాజ్యం కదా అని తమను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తే దెబ్బతీస్తామని డైరెక్టుగా హెచ్చరించింది. యుద్ధనౌకలను తీసుకొచ్చి తమ ముందు బల ప్రదర్శన చేస్తే చేతులు ముడుచుకుని స్త్రమీ కూర్చోబోమని హెచ్చరించింది.
అమెరికాకు చెందిన కార్ల్ విన్సన్ అనే భారీ యుద్ధనౌక ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఉంది. ఇప్పటికే జపాన్ కు చెందిన రెండు యుద్ధనౌకలు ఈ నౌకతో చేరాయి. ఆ రెండు దేశాలు కలసి పశ్చిమ పసిఫిక్ లో బలప్రదర్శన చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా ఇలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఉత్తరకొరియా జలాల్లో మకాం వేయాలని... అవసరమైతే అదను చూసి దెబ్బకొట్టాలంటూ యుద్ధనౌక సిబ్బందికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ యుద్ధనౌకలో యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు ఉన్నాయి. దీంతో అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది. ఒకే దెబ్బతో మీ యుద్ధనౌకను ధ్వంసం చేసి, సముద్రంలో ముంచేస్తామని... దీనికోసం తమ విప్లవ బలగాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. . ఉత్తర కొరియా అధికారిక పార్టీ పత్రిక రాడంగ్ సిన్మున్‌లో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/