అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది అంతర్జాతీయ పరిణామాలు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా పక్కోడి కంట్లో సైతం వెలెట్టి కెలికేందుకు ఏ మాత్రం సందేహించని లక్షణం చైనాలో కనిపిస్తుంది. తన ప్లేస్ లోనే కాదు.. తనకు దగ్గరగా ఉన్నదేశాలూ తన కనుసన్నల్లోనే మెలగాలని.. అంతకు మించి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ కస్సుమనే డ్రాగన్ ఈ మద్యన అమెరికా తీరుపై కుతకుతలాడుతోంది.
ఇప్పటికే దక్షిణ కొరియాలో యాంటీ మిస్సైల్ సిస్టమ్ థాడ్ ను మొహరించటంపై కోపంగా ఉన్న చైనా.. ఇప్పటికే తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. చైనాకు తోడుగా ఇప్పుడు ఉత్తర కొరియా అగ్రరాజ్యంపై విరుచుకుపడింది. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భాగంగా నేవీ సూపర్ క్యారియర్ కార్ల్ విన్సన్ ను అమెరికా మొహరిస్తున్న వేళ ఆ దేశం తీవ్రస్థాయిలో స్పందించింది.
తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా ఊరుకునేది లేదంటూ సూటిగా వార్నింగ్ ఇచ్చేసింది. అగ్రరాజ్యంపై దాడి చేసేందుకు ఎలాంటి .. దయ లేదని.. వాయు..జల.. భూమార్గాల ద్వారా దాడికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్న వైనం చూస్తే.. అగ్రరాజ్యమా..తొక్కా అన్నట్లు ఉందని చెప్పాలి. ఉత్తరకొరియా తీరుపై అగ్రరాజ్యం సైతం ఆగ్రహంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఉద్రిక్తతలు ఒక్కసారి పెరిగిపోవటమే కాదు.. ఎప్పుడేం జరుగుతుందన్నది ఇప్పుడు ఆందోళనగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/