ఎఫ్ ఎం రేడియోను నిలిపివేస్తున్న నార్వే

Update: 2017-01-09 16:12 GMT
ఎఫ్ఎంను రేడియో సేవ‌ల‌ను నిలిపివేయాల‌ని నార్వే నిర్ణ‌యింది. వ‌చ్చేవారం నుంచే ఈ నిర్ణ‌యం అమలులోకి రానుంది. డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలో 1933లో ఆవిష్కరించిన ఎఫ్‌ఎం రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ తొలినాళ్ళలో నెమ్మదిగా వ్యాపించినప్పటికీ ప్రస్తుతం చాలా పాపులర్‌ అయిపోయింది. ప్రస్తుతమున్న ఎఎం (యాంప్లిట్యూడ్‌ మాడ్యులేషన్‌) ప్రసారాల కన్నా మరింత మెరుగైన, నాణ్యమైన శబ్దాన్ని అందించడంతో ఎఫ్‌ ఎం రేడియో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.

 60ఏళ్ళ పాటు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఎఫ్‌ఎం రేడియో నెట్‌వర్క్‌ ను నిలిపివేసిన మొదటి దేశం నార్వే కానుంది. ఇతర దేశాలు త్వరలో ఇదే పంథాను అనుసరించవచ్చునని భావిస్తున్నారు. వచ్చే వారం రేడియోను మూసివేసే చర్యలు చేపట్టనున్నారు. ఈ ఏడాది చివరకి మొత్తంగా ఎఫ్‌ ఎం ప్రసారాలు నిలిచిపోతాయి. ఉత్తరాది పట్టణమైన బోడోలో స్థానిక నెట్‌ వర్క్‌ ను నిలిపివేశారు. ఎఫ్‌ ఎం స్థానంలో డిజిటల్‌ ఆడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ (డిఎబి) ప్రసారాలు ప్రారంభమవుతాయి. డిజిటల్‌ కన్నా ఎఫ్‌ఎం వ్యయం ఎనిమిది రెట్లు ఎక్కువని అంచనా వేస్తున్నారు. అయితే ఈ చర్య పట్ల ప్రజల్లో దాదాపు 66శాతం మంది అసంతృప్తితో ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News