ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా మాట్లాడతారన్న పేరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం. తాజాగా దీదీ నోట వచ్చిన కొన్ని వ్యాఖ్యలు బాబును మరపించేలా ఉండటం గమనార్హం. తన అవసరానికి మాత్రమే నోరు విప్పే దీదీ.. సాయం కోసం వెళ్లిన మిత్రుడ్ని కలిసేందుకు సైతం పెద్దగా ఇష్టపడరని చెబుతారు. ఆమె నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయన్న పేరుంది.
బాబుతో దోస్తానా మమతను మార్చేసిందా? ఆమె మాటల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయా? అన్న సందేహం కలిగేలా తాజా పరిణామాలు ఉన్నాయి. మోడీ సర్కారు తమ మీద కత్తి క్టి.. సీబీఐని ఆయుధంగా చేసుకొని తమ పోలీసు ఉన్నతాధికారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పశ్చిమబెంగాల్ సీఎం రోడ్డుపై నిరసన చేయటం తెలిసిందే.
సుప్రీంకోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ ను విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రెండు వర్గాలకు సంతృప్తిని కలిగించేలా తీర్పును ప్రకటించింది. కోల్ కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని .. అదే సమయంలో ఆయన్ను అరెస్ట్ చేయొద్దని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టిన మమత తనప్రసంగంలో భాగంగా తనకు మద్దతు తెలిపిన విపక్ష నేతలకు థ్యాంక్స్ చెప్పారు.
ఇందులో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనతో మాట్లాడారని.. మద్దతు పలికారన్నారు. దీనిపై రియాక్ట్ అయిన నవీన్.. తాను దీదీతో మాట్లాడిందేలేదని కుండబద్ధలు కొట్టారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతతో సహా మరే నేతతోనూ తాను మాట్లాడింది లేదన్న షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆయన.. సీబీఐ వృత్తిపరంగా వ్యవహరించాలన్న సూచనను చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో తాను నవీన్ పట్నాయక్ ను సంప్రదిస్తానని మమత చెప్పిన దానికి స్పందనగా నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆర్నెల్ల సావాసంలో వాళ్లు వీళ్లు అవుతారంటారు. చూస్తుంటే.. లేనిది ఉన్నట్లుగా మాట్లాడే బాబు అలవాటు.. స్వల్ప వ్యవధిలోనే మమతకు పట్టేసిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.