ఏపీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లియర్ కట్ స్వీప్ చేసేసిన వైసీపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి అంటూ ఆందోళన చేస్తున్న టీడీపీకి అక్కడి ప్రజలే మున్సిపల్ ఎన్నికల్లో వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో ఇక ఎంత మాత్రం ఉపేక్షించవద్దని జగన్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
అమరావతి రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు, నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరినట్లు తెలిపారు.
మొత్తం ఆరుగురు అధికారులు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లి నోటీసులు అందజేశారు.
రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. చంద్రబాబు అనుయాయులు లబ్ధి పొందారన్న ఆరోపణలతో ఈ నోటీసులు అందజేసినట్లు సమాచారం.