బ్రేకింగ్: నిమ్మగడ్డకు నోటీసులు

Update: 2021-03-18 11:32 GMT
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, ప్రభుత్వం మధ్య వార్ ముదురుతోంది. నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తనను హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారు.

దీంతో వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఎస్ఈసీకి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19-22 వరకూ సెలవులపై వెళ్లడానికి నిమ్మగడ్డ సిద్ధమైన నేపథ్యంలో నోటీసులు రావడంతో ఎస్ఈసీ ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

గతంలో ఏపీ సర్కార్ తో ఢీకొన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్... తమను అవమానించారంటూ..మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలంటూ.. వారు స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ.. వర్చువల్ ద్వారా భేటీ అయి.. దీనిపై చర్చించింది.  

శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే సభా కమిటీ చర్చించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)పై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు సాధ్యమా? ఆ దిశగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రివిలేజ్ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగినా.. అంతిమంగా ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News