జగన్ కోరుకున్న వలంటీర్లు.. అర్హతలివే..

Update: 2019-06-23 04:39 GMT
మాట తప్పని.. మడమ తిప్పని జగన్ ఇప్పుడు అన్న మాట నిలబెట్టుకున్నారు. నిరుద్యోగుల ఆశలు తీర్చేలా అధికారంలోకి రాగానే గ్రామ వలంటీర్ల నియామకానికి పచ్చ జెండా ఊపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసేలా వీరు గ్రామంలో అన్నీ తామై వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రభుత్వం ప్రతీ గ్రామ వలంటీర్ కు రూ.5వేల గౌరవ వేతనం చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

ఈ ఉద్యోగం ప్రధానంగా గ్రామీణులకు సేవ చేసేందుకు ఆసక్తి ఉన్న వారే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ పథకాలను ప్రతీ గడపకు అందించాలనుకునే యువత మాత్రమే ఈ జాబ్ లో చేరాలని జగన్ ప్రభుత్వం విన్నవిస్తోంది. ఉద్యోగం.. జీతం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనుకునే వారే చేరాలని కోరుతోంది.

*వలంటీర్లకు నోటిఫికేషన్

తాజాగా గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియకు జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రతీ గ్రామానికి ఒక వలంటీర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా జగన్ ప్రభుత్వం ఇందులో 50శాతం మహిళలకు రిజర్వేషన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

* ఇలా దరఖాస్తు చేసుకోండి..

-వలంటీర్లకు దరఖాస్తు చేసుకునే యువకులు ఖచ్చితంగా ఆ గ్రామానికే చెందిన వారై ఉండాలి.

-జూన్ 30 - 2019 వరకు వీరి వయస్సు 18-35 సంవత్సరాల మధ్య  ఉండాలి.

-ఇంటర్మీడియెట్ కనీస అర్హతగా నిర్ణయించారు. ఇక ఎస్టీలకు మాత్రం పదో తరగతి పాస్ అయితే చాలు.

*దరఖాస్తుకు ఇదే చివరి తేదీ..

గ్రామ వలంటీర్ల దరఖాస్తు చేసుకోవడానికి జూలై 5 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 24 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూలై 10 దరఖాస్తుల ను పరిశీలించి జూలై 11నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేస్తారు. ఆగస్టు 1న వలంటీర్లను ఎంపిక చేసి ఆగస్టు 5 నుంచి 10 వరకు శిక్షణ అందిస్తారు.


Tags:    

Similar News