కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాన్ కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయడం తప్పనిసరి అని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల కొందరు ఈ అనుసంధానం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ మరో సదుపాయం కల్పిస్తోంది. ఎస్ ఎంఎస్ ద్వారా ఆధార్ కార్డుకు పాన్ నంబర్ ను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు మెసేజ్ ద్వారా ఎలా లింక్ చేసుకోవాలో చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. 567678 లేదా 56161 నంబర్లకు ఎస్ ఎంఎస్ చేసి - ఆధార్-పాన్ ను లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ సూచించింది.
ఐటీ రిటర్న్స్ కోసం ఆధార్-పాన్ అనుసంధానాన్ని ఐటీశాఖ తప్పనిసరి చేసింది. ఐటీ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లో ఆధార్-పాన్ లింక్ ను ఏర్పాటుచేసింది. ఈ లింక్ ను ఓపెన్ చేసి.. అందులో ఆధార్ కార్డు నంబర్ ను పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. ఒకవేళ రెండు కార్డుల్లోని పేర్లలో ఏవైనా స్వల్ప తేడాలుంటే.. మొబైల్ నంబర్ కు మెసేజ్ చేసి ఓటీపీ ద్వారా రెండింటినీ ఐటీ శాఖ ధ్రువీకరిస్తుంది. ప్రస్తుతం మొబైల్ ద్వారానే రెండింటినీ అనుసంధానం చేసుకునేలా వీలు కల్పిస్తోంది ఐటీశాఖ. ఎస్ ఎంఎస్ ద్వారా ఆధార్-పాన్ ను అనుసంధానం చేసుకునే సౌలభ్యాన్ని తీసుకురావడం వల్ల మరింత మంది తమ నంబరుతో కనెక్ట్ అవగలరని పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/