ఒబామా నిష్క్రమణతో మోడీ వరల్డ్ నంబర్ 1

Update: 2017-01-20 10:20 GMT
అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలను ఇండియన్ టైం ప్రకారం ఈ రోజు రాత్రి డొనాల్డ్ ట్రంప్ చేపట్టబోతున్నారు.  అంటే... ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పదవీ కాలం పూర్తిచేసుకుంటున్నారు. ఈ పరిణామం భారత ప్రధాని మోడీని ఓ విషయంలో వరల్డ్ నంబర్ 1గా నిలపబోతోంది. అవును.. సోషల్ మీడియాలో టాప్ లీడర్ గా మోడీ నిలవబోతున్నారు. ఇంతకాలం ఒబామా టాప్ లో ఉండగా.. మోడీ సెకండ్  ప్లేస్ లోనే కొనసాగారు. కానీ.. ఒబామా నిష్క్రమణతో మోడీ ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 కానున్నారు.
    
ఫేస్ బుక్ - ట్విట్టర్ - గూగుల్ ప్లస్ - యూ ట్యూబ్ ఇలా అన్నిటినీ కలుపుకుంటే మోడీనే నంబర్ వన్ అని ప్రధాని కార్యాలయం అధికారులు చెబుతున్నారు. మోదీకి ఫేస్ బుక్ లో 3.92 కోట్ల మంది - ట్విట్టర్ లో 2.65 కోట్లు - గూగుల్ ప్లస్ లో 32 లక్షల మంది - లింక్డ్ ఇన్ లో 19.9 లక్షలు - ఇన్ స్టా గ్రామ్ లో 58 లక్షలు - యూట్యూబ్ లో 5.91 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.
    
అయితే... ఇంతవరకు ఒబామా టాప్ లో ఉన్నప్పటికీ మోడీ మాత్రం మరో విషయంలో ఒబామాను మించిపోయారు. మోడీ పేరుతో ఉన్న మొబైల్ యాప్ ను కూడా కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక దేశాధినేతకు సంబంధించి ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న యాప్ ఇదే.  ఇప్పుడు దాంతో పాటు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల్లోనూ మోడీ నంబర్ 1గా నిలవనున్నారు.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News