సర్పంచ్ పదవిని మా వారికిస్తే.. రూ.50 లక్షల డబ్బు - అరెకరం భూమి ..ఎన్నారై బంపరాఫర్ !
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమవగా.. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. మూడో విడత నామినేషన్లు కూడా మొదలయ్యాయి. ఇకపోతే , అత్యధిక పంచాయతీలను తమ మద్దతుదారుల ఖాతాలో పడాలని వైసీపీ ప్లాన్ చేస్తోంటే, అటు టీడీపీ కూడా ధీటుగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో వైసీపీ, టీడీపీ అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గ్రామాల్లో జరుగుతున్న రాజకీయాల్లో వింత విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఏకగ్రీవాల కోసం భారీ స్థాయిలో వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల 20 లక్షల వరకు కూడా సర్పంచ్ పదవికి అభ్యర్థులు వేలం పాటను పాడటం గమనార్హం. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో తమ కుటుంబానికి సర్పంచ్ పదవిని ఇస్తే గ్రామాభివృద్ధికి ఏకంగా రూ.50 లక్షలు ఇస్తానంటూ ఓ ఎన్నారై బంపరాఫర్ ఇచ్చాడు. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండటం తాళ్లచెరువు గ్రామానికి చెందిన దొండేటి మర్రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం కొన్ని సేవాకార్యక్రమాలను కూడా నిర్వహించాడు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా చేస్తుండేవాడు.
ఈ క్రమంలోనే ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని సర్పంచ్ పదవిలో చూడాలనుకున్నాడు. దీంతో గ్రామ పెద్దలకు ఓ భారీ ఆఫర్ ను ప్రకటించాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా నామినేట్ చేస్తే, గ్రామాభివృద్ధికి 50 లక్షల రూపాయలు ఇస్తానని మర్రెడ్డి ప్రకటించాడు.50 లక్షల రూపాయలతోపాటు ఊళ్లో ఉన్న ఒక అర ఎకరం భూమిని కూడా గ్రామాభివృద్ధికి రాసి ఇస్తానని తెలిపాడు. అమెరికాలో ఉండి వీడియో కాల్ ద్వారా గ్రామ పెద్దలతో ఈ విషయాన్ని నేరుగా మాట్లాడాడు. ఊళ్లో సొంతంగా ఫంక్షన్ హాల్ నిర్మిస్తాననీ, గ్రామంలో నీటి ఎద్దడి సమస్యను తీర్చేందుకు ఎత్తిపోతల పథకం వచ్చేలా కృషి చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులు కాకుండా వేరెవరినైనా గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, గ్రామాభివృద్ధికి రూ.10 లక్షల విరాళం ఇస్తానని కూడా మర్రెడ్డి స్పష్టం చేశాడు.